సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన చిత్రం కబాలి. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రజనీకాంత్ హీరోగా వస్తున్న ‘కబాలి’ ఫస్ట్ టీజర్‌ సోషల్ మీడియాలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసింది. జూలై 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే టీజర్‌తో వచ్చిన రెస్పాన్స్‌ కి మార్కెట్ వర్గాల్లోనూ ఈ మూవీపై భారీ డిమాండ్ ఏర్పడుతుంది.


కొన్ని ఏరియాల్లో ఫ్యాన్సీ రేటుకి ఈ మూవీ ఏరియా రైట్స్ ని ధక్కించుకుంటున్నారు. మొత్తం కోట్ల వ్యవహారంలో జరుగుతున్న బిజినెస్ గా కబాలి వ్యవహారం జరుగుతుంది. అయితే తాజాగా కర్ణాటక ప్రాంతానికి సంబంధించిన ఓ పెద్ద డిస్ట్రిబ్యూషన్ సంస్థ, కబాలి హక్కులను భారీ మొత్తంకి చేజిక్కించుకుంది. అంత పెద్ద మొత్తంలో ఆ సంస్థ కబాలి హక్కులను ధక్కిచుంకున్నప్పటికీ..ఆ డిస్ట్రిబ్యూటర్ కి రజనీకాంత్ ఝలక్ ఇచ్చాడని అంటున్నారు.


సినిమాని చూసిన తరువాతనే కొనాలని, ఎంత వరకు సాధ్యం అయితే అంత వరకూ మాత్రమే డబ్బులు పెట్టాలని సూచించాడు. సినిమా రిలీజ్ తరువాత జరిగే ఆర్ధిక లావాదేవిల విషయంపై రజనీకాంత్ కి ఎటువంటి సంబంధం లేదని చెప్పుకొచ్చాడు. నష్టం వచ్చినా, లాభవం వచ్చినా రజనీకాంత్ ఇంటికి ఏ డిస్ట్రిబ్యూటర్ రాకుడదనేది రజనీ సలహా. ఇప్పటికే పలుస్లారు డిస్ట్రిబ్యూటర్స్ రజనీకాంత్ ఇంటి ముందుకు దర్నా చేశారు.


ఇప్పుడు కబాలి విషయంలో అదే విధంగా ధర్నా చేసే అవకాశం రాకుండా, ముందుగానే అందరికి రజనీ తన వంతుగా చెప్పుకువస్తున్నాడని అంటున్నారు. ఇక ఈ మూవీకి సంబంధించిన ఆడియో జూన్ 10వ తేదీ లోపులో విడుదల కానుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: