అందాల భామ రాశి ఖన్నా తన అంద చందాలతో తెలుగు ప్రేక్షకులను వల్లో వేసుకుంది. ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది అనతి కాలంలోనే సూపర్ క్రేజ్ సంపాదించింది. ఓ పక్క కుర్ర హీరోలతో జోడి కడుతూనే మరో పక్క స్టార్ హీరోలకు సిగ్నల్స్ ఇస్తున్న ఈ చిన్నది రీసెంట్ గా వచ్చిన సుప్రీంతో సూపర్ హిట్ అందుకుంది.


బెంగాల్ టైగర్ లో రాశి ఖన్నా :


ఇక హిట్ కొట్టిన ఈ భామను తమ సినిమాలో పెట్టుకునేందుకు దర్శక నిర్మాతలు వెంటపడుతున్నారు. ప్రస్తుతం రాశి ఖన్నా కమిట్ అయిన సినిమాలు ఆక్సిజన్, రాబిన్ హుడ్.. గోపిచంద్ హీరోగా జ్యోతికృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఆక్సిజన్. ఏం.ఎం.రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే సినిమా ఓ మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కించబడుతుందని ఇప్పటికే తెలిసిందే. 


ఇక దానితో పాటు ఆక్సిజన్ లో రాశి అందాలు కూడా స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యేలా చూస్తున్నారట దర్శక నిర్మాతలు. ఇప్పటిదాకా ఏ సినిమాలో ఉండనంత హాట్ గా రాశి ఖన్నా రాబోయే ఆక్సిజన్ సినిమాలో ఉంటుందని టాక్. అంతేకాదు సినిమాలో బికిని సీన్స్ కూడా చేస్తుందని అంటున్నారు. ఇప్పటికే బెంగాల్ టైగర్ సినిమాలో బికినితో అలరించిన రాశి మరోసారి అభిమానులను ఎంటర్టైన్ చేయనుంది. 


సుప్రీమ్ సినిమాలో సాయి ధరం తేజ్, రాశిఖన్నా :  


రీసెంట్ గా వచ్చిన సుప్రీంలో కూడా అందాల విందు విరజిమ్మిన రాశి ఇక స్టార్ హీరోల పక్కన్ తాను పర్ఫెక్ట్ అని అనిపించుకునేందుకే ఈ గ్లామర్ షో చేస్తుంది. మరి దాన్ని గుర్తించి ఏ స్టార్ హీరో అయినా అవకాశం ఇస్తే మంచింది. మరి రాశి అందాలతో ఆటాడుకునే అవకాశాన్ని ఏ స్టార్ హీరో దక్కించుకుంటాడో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: