తీసిన ప్రతి సినిమాల్లో తన అనుకున్న ఫీల్ ను మెయింటైన్ చేస్తూ చేసిన సినిమా ప్రతీది హిట్ అందుకుంటున్న దర్శకుడు వంశీ పడిపల్లి. రీసెంట్ గా ఊపిరి హిట్ అందుకున్న వంశీ పైడిపల్లి అఖిల్ తో సినిమా తీస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఇద్దరి మధ్య స్టోరీ డిస్కషన్ జరుగుతున్న ఈ నేపథ్యంలో సినిమా ఉంటుందని కొందరు ఉండదని మరి కొందరు తెగ హడావిడి చేస్తున్నారు.


ఊపిరి హీరోలతో వంశీ పైడిపల్లి :


అయితే ఫిల్మ్ నగర్ లో గట్టిగా వినిపిస్తున్న మాట ఏంటంటే వంశీ పడిపల్లి అఖిల్ సినిమా నుండి అవుట్ అయ్యాడట. ఈలోపు అఖిల్ కృష్ణగాడి వీర ప్రేమ గాథ దర్శకుడితో డిస్కషన్ చేయడం ఇదంతా వంశీ నోటీస్ కు వచ్చాయి. అయితే ఇప్పుడు వంశీకి మరో షాక్ ఏంటంటే అఖిల్ హను రాఘవపూడిని కూడా కాదని కొరటాల శివ కోసం ఎదురుచూస్తున్నాడట.


కొరటాల శివ అయితే కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు ఉంటాయని అఖిల్ నమ్మకం. అయితే ఇదో రకంగా వంశీకి తలనొప్పిగా మారింది. ఇన్ని జరుగుతున్నా నాగార్జున మాత్రం అఖిల్ రెండో సినిమా వంశీతోనే చేసేందుకు ఇంకా ప్రయత్నాలు చేస్తున్నాడట. అఖిల్ కథల విషయంలో ఎలాంటి ఫైనల్ డెశిషన్ తీసుకోవట్లేదని వంశీ కూడా చూసి చూసి బయటకు వచ్చాడని టాక్.


ప్రెస్ మీట్ లో అఖిల్ : 


మరి ఇంతకీ అఖిల్ సెకండ్ సినిమా డైరెక్ట్ చేసేది ఎవరు అంటే ఎప్పటిలానే ఆ డైరక్టర్ ఈ డైరక్టర్ అనే చెప్పాల్సి వస్తుంది. మరి ఈ కన్ ఫ్యూజన్ ఎప్పటికి క్లియర్ అవుతుందో ఏమో చూడాలి. ప్రస్తుతం జలీ ట్రిప్ ఎంజాయ్ చేసొచ్చాక కాని వంశీ తన తర్వాత సినిమా కోసం తగిన రైట్ స్టెప్ తీసుకునే అవకాశం ఉంది...! 



మరింత సమాచారం తెలుసుకోండి: