‘బాహుబలి’ తీసి జాతీయస్థాయిలోనే కాకుండా అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్న రాజమౌళికి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాకు సంబంధించి వస్తున్న వార్తలు ఒక విషయంలో టెన్షన్ పడుతున్నాయని టాక్. దీనికి కారణం ఈసినిమాకు సంబంధించిన శరవేగ చిత్రీకరణ అని అంటున్నారు. ఇటీవల మొరాకాలో ప్రారంభమైన ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్త కావడామే కాకుండా ఎన్నో హాలీవుడ్ చిత్రాలు షూటింగ్ జరుపుకునే మొరాకోలోని అద్భుతమైన లోకేషన్స్ లో ఇంత పెద్ద షెడ్యూల్  చిత్రీకరణను జరుపుకున్న మొదటి తెలుగు సినిమాగా ‘గౌతమీ  పుత్ర శాతకర్ణి’ రికార్డు క్రియేట్ చేయడం రాజమౌళికి ఊహించని షాక్ గా మారింది అని టాక్. 

రాజమౌళి  తన వండర్ ‘బాహుబలి’ తో ప్రపంచ రికార్డులను సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా చిత్రీకరణ కోసం దాదాపుగా రెండు సంవత్సరాలు తీసుకున్నాడు రాజమౌళి.  ప్రస్తతం ‘బాహుబలి’ కన్ క్లూజన్‌ కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నా రిలీజ్ డేట్ ప్రకటించిన సమయానికి  ఈ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకుని విడుదల అవుతుందా అన్న సందిగ్దంలో ఉన్నాడట.   

దీనికి తోడు ‘గౌతమీపుత్ర శతకర్ణి’  హాలీవుడ్ చిత్రాలు షూటింగ్ జరుపుకునే మొరాకోలోని  అట్లాస్ స్టూడియోస్ లో సినిమా షెడ్యూల్ చిత్రీకరణ  జరగటంతో పాటు ఈ నెల 30 నుండి హైదరాబాద్ లోని చిలుకూరు బాలాజీ దేవాలయం సమీపంలో ఈ సినిమాకోసం భారీ యుద్ధనౌక సెట్ వేసి ఆ సెట్ లో షూటింగ్ చేయనున్నారుఅనే వార్తలు కూడ రాజమౌళికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నట్లు టాక్. 

ఈ షెడ్యూల్ కోసం 200 మంది ఆర్టిస్టులకు ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ అధ్వర్యంలో యుద్ధానికి సంబంధించి కత్తిసామును ప్రాక్టీస్ చేయిస్తున్నవిషయాలు తెలిసినవే. ఈ వార్తలు అన్ని రాజమౌళికి నిద్రలేకుండా చేస్తున్నాయని అంటున్నారు.  దీనితో ‘బాహుబలి’ కి ధీటుగా విజువల్ ఎఫెక్ట్స్‌తో తెరకెక్కుతున్న బాలయ్య 100వ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండటంతో ఈమధ్య రాజమౌళి తన టీంను పిలిచి పెద్ద  క్లాస్ తీసుకున్నాడట. పనిలో వేగం పెంచాలని సూచించాడట. ‘బాహుబలి’ రెండోపార్ట్ కంటే ముందే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ విడుదల అవుతున్న నేపధ్యంలో  ఏ మాత్రం అశ్రద్ద  చేసిన ‘బాహుబలి 2’ అంచనాలాలో తేడాలు వస్తాయని రాజమౌళి  తెగ టెన్షన్ పడుతున్నట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: