తెలుగు ఇండస్ట్రీలో కామెడీ యాక్టర్లు చాలా మందే ఉన్నారు..ఈ మద్య ఈటీవి జబర్ధస్త్ కామెడీ షో నుంచి వేణు,ధన్ రాజ్,శకలక శంకర్,చమ్మక్ చంద్ర,శేషు ఇలా చాలా మంది కమెడియన్లు తెలుగు తెరపై తమ సత్తా చాటుతున్నారు. ఇక వేణు, తాగుబోతు రమేష్, ధన్ రాజ్, శకలక శంకర్ రెగ్యూలర్ కమెడియన్లు గా మారిపోయారు. అయితే కమెడియన్లు అప్పుడప్పుడు హీరోల అవతారం ఎత్తుతుంటారు..ఇలా రాజబాబు దగ్గర నుంచి నిన్న మన్నటి ధన్ రాజ్ వరకు హీరోలుగా కనిపిస్తూ వచ్చారు. అయితే హీరోలుగా వేస్తూనే కామెడీ రోల్స్ చస్తూన్న కమెడియన్లలలో ఆలి,బ్రహ్మానందం,ధన్ రాజ్, తాగుబోతు రమేష్ లాంటి వారు ఉన్నారు.

ఇక ధన్ రాజ్ పదమూడు పాత్రల్లో నటిస్తున్న చిత్రం పనిలేని పులిరాజు.  ఈ చిత్రం మోషన్ డైలాగ్ పోస్టర్ ను ఇంటర్నెట్లో విడుదల చేశారు.  " దశావతారం లో కమల్ 10 పాత్రలలో కనిపిస్తే ఇప్పుడు ధన్ రాజ్ పదమూడు గెటప్ లలో కనిపించి మరో రికార్డు సృష్టించనున్నాడు. పూర్తి స్థాయి కామెడీ ఎంతర్ టైనర్ గా రూపొందు తున్న ఈ చిత్రం మోషన్ డైలాగ్ పోస్టర్ ను ఇంటర్నెట్లో విడుదల చేశారు.
Pani Leni Puliraju Motion Poster Released
పాలేపు మీడియా ప్రై.లి. పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు చాచా. ప్రస్తుతం ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. చిత్రాన్ని జూన్ మూడోవారంలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.  ప్రాచిసిన్హా, శ్వేతావర్మ, ఇషా, హరిణి,రఘుబాబు, కొండవలస, కోటేశ్వరరావు, తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఆనంద్ మరుకుర్తి, సంగీతం: వి.వి. సహ నిర్మాత: రవి.కె.పున్నం, సమర్పణ: పి. లక్షి, నిర్మాత: పి.వి. నాగేష్ కుమార్, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం: చాచా.



మరింత సమాచారం తెలుసుకోండి: