కొబ్బరి మట్ట అంటూ బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు ఈ మధ్య తన టీజర్ తో తెగ హడావిడి చేస్తున్నాడు. ఈ టీజర్ కి విపరీతమైన రెస్పాన్స్ వస్తూ ఉండడం విశేషం. హృదయ కాలేయం సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యి సంపూ గా గుర్తింపు తెచ్చుకుని పారడీ కామెడీ లకి పెట్టింది పేరుగా మారిన సంపూర్నేష్ బాబు కొబ్బరి మట్ట కి మంచి ప్రమోషన్ ల కోసం ప్లాన్ చేస్తున్నాడు. అందులో భాగంగా ఈ టీజర్ ని మెగా స్టార్ చిరంజీవి దగ్గరకి తీసుకుని వెళ్లి ఆయనకీ స్వయంగా చూపించాడు.

 

 

మూడు రోజుల క్రితం విడుదల అయిన ఈ టీజర్ సోషల్ మీడియా లో సూపర్ హిట్ అవ్వగా చాలా తక్కువ సమయం లో ఐదు లక్షల వ్యూస్ దాకా వచ్చాయి. యూట్యూబ్ ట్రెండ్ లలో కూడా టాప్ స్థానం లోకి వచ్చింది . అంతగా హిట్ అయిన ఈ టీజర్ మీద టాలీవుడ్ సెలెబ్రిటీ లు చాలా మంది పాజిటివ్ గా ఫీడ్ బ్యాక్ కూడా ఇచ్చారు. దాంతో సినిమా మీద ఇంకా హైప్ క్రియేట్ చెయ్యాలి అనే ఉద్దేశ్యం తో తన ఫేవరేట్ హీరో ఐన చిరంజీవి ని స్వయంగా కలిసి ఆయనకీ తన టీజర్ చూపించాడు సంపూ. నిన్న సినీ కార్మికులకి సంబంధించిన సన్మాన వేడుక కి చిరంజీవి ముఖ్య అతిధి గా రాగా అక్కడ సంపూ దొరికిందే ఛాన్స్ అన్నట్టు ఆయనకీ తన టీజర్ ని చూపించాడు. అన్నట్టు ఈ సినిమా టీజర్ ని విడుదల చేసింది కూడా చిరంజీవి మేనల్లుడు సాయి ధరం తేజ కావడం విశేషం. ఈ రకంగా మెగా ఫ్యామిలీ నుంచి సంపూ కి చాలా ఆశీర్వాదాలు లభిస్తున్నాయి.

 

సంపూ ఇందులో పలికిన సుదీర్ఘమైన డైలాగ్ చూసి - విని చిరంజీవి స్టేజీ మీద గట్టిగా నవ్వుకోవడం విశేషం. టీజర్ బాగుంది అని సంపూ ని అభినందించడమే కాక సినిమా విశేషాలు ఒక్కొక్కటీ అడిగి తెలుసుకున్నారు చిరంజీవి. అయితే ఇంతకీ విషయం ఏంటంటే మనకి అందుతున్న సమాచారం ప్రకారం. మెగా ఫ్యామిలీ ద్వారా తన సినిమా ప్రమోషన్ ని వేగవంతం చేస్తున్న సంపూర్నేష్ బాబు ట్రైలర్ ని పవన్ కళ్యాణ్ చేతుల మీదగా ఆవిష్కరించే ప్లాన్ చేస్తున్నాడట. పవన్ కళ్యాణ్ ని ఆడియో ఫంక్షన్ కి పిలవాలి అని ఆయన రాకపోయే ఛాన్స్ ఉంది కాబట్టి స్వయంగా ఆయన దగ్గరకి వెళ్లి ఇంట్లోనో, షూటింగ్ లోని ఆయన చేతుల మీదగా ట్రైలర్ ని లాంచ్ చేసి తన సినిమాకి అతిపెద్ద హైప్ తెచ్చుకోవాలి అని ప్లాన్ లో ఉన్నాడట సంపూ. ఇంత ఇబ్బంది లేకుండా పిలవగానే ఆడియో ఫంక్షన్ కి కళ్యాణ్ ఒచ్చేస్తే ఇక అంతకంటే ఆనందం ఏముంటుంది.కేవలం సోషల్ మీడియాను నమ్ముకుని ఎదిగిన సంపూ.. ఇలా తన సినిమా విషయం లో జాగ్రత్తగా ప్లాన్ లు వేసుకుంటూ ముందుకి వెళ్ళడం నిజంగా హర్షణీయం.

 


మరింత సమాచారం తెలుసుకోండి: