యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పోటీ పడాలంటే దానికి తగ్గ స్టామినా ఉండి తీరాల్సిందే.. అయితే ఈ ఆగష్టులో అక్కినేని నందమూరి బాక్సాఫీస్ ఫైట్ తప్పేలా లేదు. తారక్ కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ తో రిపేర్లు చేస్తుంటే.. మలయాళ బ్లాక్ బస్టర్ తో ప్రేమం అంటూ వస్తున్నాడు నాగ చైతన్య. ఈ రెండు సినిమా రిలీజ్ డేట్లు ఒకేరోజు అవడం విశేషం.  


ప్రేమం మూవీ పోస్టర్ :


ఎన్టీఆర్ కు పోటీగా చైతు నిలవగలడా అంటే కంటెంట్ నమ్ముకుని వస్తున్న సినిమా కాబట్టి కచ్చితంగా వర్క్ అవుట్ అవుతుందనే పోటీకి కత్తి దూస్తున్నాడు చైతన్య. ఇక జనతా గ్యారేజ్ అయితే కొబ్బరికాయ కొట్టిన రోజే రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసేశారు. అది రాకుండా ఆగే ప్రసక్తే లేదు. మరి ఇంట్రెస్టింగ్ గా తయారైన ఈ రెండు సినిమాల పోటీ రసవత్తరంగా మారింది. 


మిర్చి, శ్రీమంతుడు సినిమాతో హిట్స్ అందుకున్న కొరటాల శివ జనతా గ్యారేజ్ ను కూడా బ్లాక్ బస్టర్ చేసేందుకు తన ప్రతిభను చూపితున్నాడు. ఇక కార్తికేయ సినిమాతో హిట్ అందుకుని రాజమౌళి చేతే శభాష్ అనిపించిన చందు మొండేటి ప్రేమం దర్శకత్వం చేయడం స్పెషల్ ఎట్రాక్షన్. మరి ఈ రెండు సినిమాల్లో ఏది విజయం సాధిస్తుందో చూడాలి.


జనతా గ్యారేజ్ ఫస్ట్ లుక్ : 


మలయాళ ప్రేమం చక్కని ప్రేమ కథగా అక్కడ స్టార్ హీరోల సినిమాలను కూడా నెట్టేసి సూపర్ హిట్ సాధిచింది. మరి అదే మ్యాజిక్ ఇక్కడ వర్క్ అవుట్ అవుతుందో లేదో చూడాలి. ఆగష్టు 12న రిలీజ్ అవుతున్న ఈ రెండు సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో అని ఆడియెన్స్ అందరు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: