దాదాపు 39 సంవత్సరాల క్రితం కమలహాసన్ హీరోగా అలనాటి కోలీవుడ్ టాప్ డైరెక్టర్ భారతీరాజా తీసిన ‘ఎర్రగులాబి’ సినిమా కథ ప్రభావం త్వరలో విడుదల కాబోతున్న నాని ‘జెంటిల్ మన్’ మూవీ పై ఉంది అన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈసినిమా ఫస్ట్ లుక్ టీజర్లకు విశేష స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఈసినిమా విడుదల కాకుండానే ప్రస్తుతం మంచి పాజిటివ్ టాక్ తో హడావిడి చేస్తోంది. నాని కూడ ఈసినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ‘భలే భలే మగాడివోయ్’ ‘కృష్ణగాడి వీరప్రేమ గాథ’ విజయాల తరువాత త్వరలో రాబోతున్న ఈ సినిమా నానీకి హ్యాట్రిక్ హిట్ గా మారుతుంది అని అంటున్నారు.

అయితే ఇటువంటి ప్రయోగాత్మక సినిమాలో ప్రస్తుతం మంచి కెరియర్ పీక్ లో ఉన్న నాని నటించడం ఎంత వరకు మంచిది అన్న కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి. అంతేకాదు వరస విజయాలతో దూసుకు పోతున్న నాని దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ చేసే ఈ ప్రయోగంలో నటించడం అవసరమా ? అంటూ నానీకి చాలామంది బ్రెయిన్ వాష్ ఇచ్చినట్లు టాక్. 

అయితే దర్శకుడు ఇంద్ర గంటి మోహన్ కృష్ణ ఆంగ్ల రచయిత డేవిడ్ నతాన్స్ కథలను పోలి ఉండే విధంగా తయారు చేసిన స్క్రిప్ట్ తనకు విపరీతంగా నచ్చడంతో తాను ఈ ‘జెంటిల్ మన్’ సినిమాలో నటిస్తున్నాను అని సద్ధిచేప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే సందర్భంలో నాని తన సన్నిహితుల వద్ద మరో కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. 

కొన్ని సంవత్సరాలు తరువాత తాను సినిమా రంగంలో ఉన్నా లేకపోయినా తాను నటించిన సినిమాలు మాత్రం అందరికీ జ్ఞాపకం ఉండిపోయే విధంగా తన సినిమాలు ఉండాలని తాను అభిలాష పడుతున్నానని కామెంట్ చేసినట్లు టాక్. అందుకే కాబోలు నాని తాను నటించే ప్రతి సినిమా పాత్ర ఎంపికలో ఒక డిఫరెంట్ గా ఉండటానికి నాని తెగ తాపత్రయ పడుతూ ఉంటాడు. నెగిటివ్ ఛాయలతో నాని నటిస్తున్న ఈ ‘జెంటిల్ మన్’ విజయవంతం అయితే మన టాప్ హీరోలు కూడ ఇటువంటి నెగిటివ్ టచ్ ఉండే పాత్రలను చేసే అవకాశం ఉంది..



మరింత సమాచారం తెలుసుకోండి: