గత కొద్ది రోజులుగా టాలీవుడ్ లో ఎవరి నోట విన్నా హాట్ టాపిక్ గా మారిన సమంత బాయ్ ఫ్రెండ్  ఎవరు అన్న విషయం పై జరుగుతున్న చర్చలే అన్నది వాస్తవం. సమంత వ్యూహాత్మకంగా వదిలిన ఫీలర్లు ఆపై ఆమె ‘ఎన్' చైన్ లాకెట్ ఆ ‘ఎన్’ ఎవరో మీకు తెలియదా అంటూ లేటెస్ట్ గా హీరో నితిన్ మీడియాతో వేసిన జోక్స్ అన్ని కలిపి ఇప్పుడు ఈ సబ్జక్ట్ ను టాలీవుడ్ లో ఒక ఇన్ సైడ్ డిస్కషన్ పాయింట్ గా మార్చేసాయి. 

దీనితో ఒక టాప్ హీరో కుటుంబంలో చిన్న రచ్చ కూడ జరిగింది అన్న టాక్ ఇప్పటికే బయటకు వచ్చింది. ప్రేమ వివాహానికి అబ్జెక్షన్ లేదని కానీ సమంత కరెక్ట్ కాదని ఆ ‘ఎన్' ఫాదర్  తన కొడుకుతో ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నాడని కధలుకధలుగా ప్రచారం జరుగుతోంది. ఇది ఇలా ఉండగా ఈ విషయ మై   ఆ ‘ఎన్' మాత్రం తన సన్నిహితుల దగ్గర కూడా నోరు విప్పడం లేదని ఫిలింనగర్ టాక్. 

ఎవరైనా ఈ విషయం ప్రస్తావించినా నవ్వేసి నథింగ్ అని సున్నితంగా ఈ విషయాన్ని తప్పిoచి వేస్తున్నాడని టాక్. ఇది ఇలా ఉండగా కావాలనే సమంత ఈ వ్యవహారానికి తెర తీసింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి సమంతకు చేతిలో పెద్దగా సినిమాలు లేకపోవడంతో పాటు ఈమధ్య ఆమె క్రేజ్ తగ్గుతూ ఉండటంతో ‘అ ఆ’ విడుదల సమయంలో ఈ ఫీలర్లు గ్యాసిప్ లు ఆ సినిమాకు ఫ్రీ పబ్లిసిటీగా అదే విధంగా తనకు బాగా ఉపయోగ పడి తన ఫ్యూచర్ కు మైల్ స్టోన్ గా పనికి వస్తాయని సమంత చాలా వ్యూహాత్మకంగా  ఈ ఫీలర్లు వదిలింది అన్న ప్రచారం జరుగుతోంది. 

ఈ మాటలు ఇలా బయటకు రావడంతో సమంత అతి తెలివి తేటలకు  ‘ఎన్' కాంపౌండ్ షాక్ అయింది అన్న వార్తలు వస్తున్నాయి. అందుకే కాబోలు సమంతను మాయ లేడి అని ముద్దుగా పిలుస్తూ ఉంటారు..



మరింత సమాచారం తెలుసుకోండి: