తెలుగు, తమిళ ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలోనే ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్న హీరోయిన్లలో త్రిష ఒకరు. ఇప్పటి వరకు తెలుగు, తమిళ ఇండస్ట్రీలో అగ్ర హీరోల సరసన నటించిన ఈ అమ్మడు ప్రస్తుతం 30 ప్లస్ అంటే ఎవ్వరూ నమ్మరు. ఇప్పటికీ త్రిష జోరు రెండు ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది. ఈ మద్య హర్రర్ కాన్సెప్ట్ తో వచ్చిన కళావతి సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ప్రస్తుతం ‘నాయకి’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తర్వాత వెంటనే మరో హర్రర్ ఓరియెంటెడ్ చిత్రం ‘మోహిని’ అనే చిత్రంలో నటించనుందట. అయితే ఇక్కడే పెద్ద ట్విస్ట్..వాస్తవానికి త్రిష మొదటి నుంచి గ్లామర్ ప్రాధాన్యత గల చిత్రాల్లో బాగా నటించేది.

ఒక్కోసారి ఆ డోస్ కూడా బాగానే పెంచిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఇక మోహిని చిత్రంలో ఈ అమ్మడు దాదాపు న్యూడ్ గా కొన్ని సీన్లలో కనిపించనుందట. ఫ్యాంటసీ తరహీ రూపొందబోయే ఈ చిత్రంలో త్రిష అలా నటించడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్న పాత్రలో త్రిష ప్రేక్షకులను త్రిల్ చేయడమే కాకుండా అందాల విందుతో మరింత పసందుని అందించనుందట.

ఈ చిత్రానికి సంబంధించి కొన్ని సన్నివేశాలు  థాయిలాండ్ తో పాటు ఏషియా లోని పలు ప్రాంతాల్లో షూట్ చేయనున్నారట . మాదేష్ దర్శకత్వం లో మోహిని చిత్రం తెరకెక్కనుంది. మొత్తానికి ఈ అమ్మడు సెమీ న్యూడ్ సీన్లు అనగానే కుర్రకారు కళ్లు అప్పగించి చూడటం ఖాయం. గతంలో త్రిషకి సంబంధించి కొన్ని బాత్ రూమ్ సీన్లు లీక్ అయినట్లు పెద్ద దుమారమే చెలరేగింది..అయితే అవి తనవి కావని త్రిష క్లారిటీ ఇచ్చింది. అయితే ఇప్పుడు డైరెక్టుగా ఈ అమ్మడు సెమీ న్యూడ్ లో ఎలా కనిపించనుందో అని త్రిష అభిమానులు వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: