ఆ మద్య సినీ ఇండస్ట్రీలో విషాదాల వరుసగా చోటు చేసుకున్నాయి..ముఖ్యంగా మలయాళ నటుడు కళాభవన్ మరణం గత కొంతకాలంగా మిస్టరీగా సాగుతూనే ఉంది. అయితే ఆయనపై విష ప్రయోగం చేసి ఉండవచ్చని సన్నిహితులు తెలపడంతో పోలీసులు ఆ కోణంలో పరిశోదనలు మొదలు పెట్టారు. ఆయన విష ప్రయోగం వల్లే చనిపోయారన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. హైదరబాద్ కు చెందిన ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (సీఎఫ్ ఎస్ ఎల్) నిర్వహించిన పరీక్షల్లో వెల్లడైన వివరాలతో అనుమానాలు మరింత బలపడ్డాయి.
టాలీవుడ్ కు షాక్ ఇచ్చిన కళాభవన్ మణి మరణం !
మణి శరీరంలో అత్యంత విషపూరితమైన మిథైల్ ఆల్కహాల్ (మిథనాల్) అవశేషాలు కనుగొన్నట్టు ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది. గతంలో మణి బాడీని పరిశీలించిన కొచ్చిలోని ఓ రసాయన పరీక్షా కేంద్రం.. అందులో క్రిమి సంహారక మందు ‘క్లోర్ పిరిఫొస్’ అవశేషాలున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే.ఐతే హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్ అలాంటిదేమీ లేదని అంటోంది. మని బాడీలో ఐతే మిథైల్ ఆల్కహాల్ శాతం ఎంత ఉంది.. అది మణి మరణానికి ఎంత వరకు కారణమైంది అన్నది తెలియాల్సి ఉంది.

కళాభవన్ తెలుగు, తమిళ, మళియాలీ భాషల్లో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. మణి ఒకప్పుడు సాధారణ ఆటోడ్రైవర్  అటువంటి స్థాయి నుండి నటుడిగా ఎదిగి దాదాపు 100 సినిమాలలో దక్షిణాదికి చెందిన అన్ని భాషలలోను నటించడం ఆయన రికార్డు. మిమిక్రీ ఆర్టిస్టుగా, గాయకుడిగా, ప్రస్థానం ఆరంభించి తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టిన మణికి జాతీయ స్థాయిలో స్పెషల్ జ్యూరీ అవార్డు కూడ వచ్చింది.

జెమిని చిత్రంలో వెంకటేష్,కళాభవన్ మణి


తెలుగులో వెంకటేష్ తో సమానంగా ‘జెమిని’ చిత్రంలో నటించారు. వివిధ జంతువుల అనుకరణ చేస్తూ అప్పట్లో ఔరా అనిపించుకున్నారు. ఈ ఏడాది మార్చి 6న అతను హఠాత్తుగా  కోచిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మణి నిన్న 7.15 నిమిషాలకు తుది శ్వాస విడిచారు.   ముందు అనారోగ్యం వల్ల చనిపోయాడని అనుకున్నా.. తర్వాత అనుమానాస్పదంగా మృతి చెందినట్లు వెల్లడైంది



మరింత సమాచారం తెలుసుకోండి: