పవన్ నటించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చాల చోట్ల తీసివేసినా దానితో సంబంధం లేకుండా ప్రస్తుతం ఛానల్స్ అన్నీ పవన్ కళ్యాణ్ నామస్మరణతో హోరెత్తి పోతూ ఉండటం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఈ వారం విడుదల కాబోతున్న ‘అ ఆ’ ప్రచారంలో పవన్ ను చాల వ్యుహత్మకంగా వాడుకుంటున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఛానల్స్ లో ప్రసారం అవుతున్న టీజర్ లో ‘ఆడవాళ్లలో అందానికి ప్రతీక ‘సమంత అయితే మగాళ్లలో అందానికి రోల్ మోడల్ పవన్ కళ్యాణ్ అంటూ ఈ యాడ్ లో ఆదరగోడుతూ పవన్ ఇమేజ్ ని ‘అ ఆ’ కోసం వాడుతున్నారు. 

ఈ సినిమాలో హీరోయిన్ సమంత కాబట్టి ఆమెను ఈ యాడ్ లో చూపెడుతున్నారు. అయితే పవన్ ఈ సినిమాలో నటించకపోయినా పవన్ నామస్మరణ మాత్రం ‘అ ఆ’ యాడ్ లో కనిపిస్తోంది.  ఈసినిమాకు దర్శకుడు త్రివిక్రమ్ కాబట్టి ‘అ ఆ’ సినిమాలో వచ్చే సీన్స్ లో ఇంకా ఎక్కువగా పవన్ ప్రస్తావన వచ్చినా ఆశ్చర్యం లేదు అని అనిపిస్తోంది. 

ఇప్పటికే త్రివిక్రమ్ పవన్ దేవుడుగా తన మాటలలో మార్చేశాడు కాబట్టి ‘అ..ఆ’లో పవన్ భజన పీక్స్ కు చేరి ఉండవచ్చు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే పవన్ కు దేవుడు ఇచ్చిన తమ్ముడుగా ప్రచారం చేసుకుంటున్న నితిన్ ఈసారి ‘అ ఆ’ సినిమా పబ్లిసిటీ యాడ్ లో కూడ విపరీతంగా పవన్ ను వాడేయడం టాపిక్ అఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఇప్పటికే చాలామంది హీరోలు తమ తండ్రుల పేర్లను తాతల పేర్లను మేనమామల ప్రేర్లను తెగ వాడుకుంటూ హడావిడి చేస్తున్న నేపధ్యంలో వారితో సమానంగా  నితిన్ ఈ విధంగా పవన్ నామస్మరణ కోనసాగిస్తున్నాడు అనుకోవాలి.


ఈ వార్తలు ఇలా ఉండగా ‘అ ఆ’ సినిమాకు ఓవర్సీస్ ప్రేక్షకులలో ఏర్పడిన క్రేజ్ రీత్యా ఈసినిమాను అమెరికాలోనే కాకుండా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, లండన్ లో కూడ భారీ స్థాయిలో విడుదల చేస్తున్న నేపధ్యంలో ఈ సినిమాతో నితిన్ కెరియర్ లో ఇప్పటి వరకు ఏ సినిమాకు రాని భారీ ఓపెనింగ్స్  వస్తాయి అన్న వార్తలు వినిపిస్తున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: