తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా ఒకప్పుడు చిరంజీవి స్వయంకృషితో పైకి వచ్చిన విషయం తెలిసిందే..అయితే తనలా స్వయంకృషితో పైకి వచ్చే హీరోలు అన్నా నటీనటులు అన్నా చిరంజవి బాగా ఎంకరేజ్ చేస్తారని టాలీవుడ్ లో చెప్పుకుంటారు. ఇక తెలుగు ఇండస్ట్రీలో ‘హృదయకాలేయం’ చిత్రంతో బర్నింగ్ స్టార్ గా ఎంట్రీ ఇచ్చిన సంపూర్ణేష్ బాబు తొలి చిత్రంతోనే చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్ వేషాలు వేస్తూనే ‘సింగం123’ చిత్రంలో పేరడీతో కూడిన సినిమా తీశారు..ఈ చిత్రం పెద్దగా విజయం సాధించకపోయినా సంపూ కామెడీకి మాత్రం పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. తాజాగా ‘కొబ్బరి మట్ట’ చిత్రంతో ఏకంగా త్రిపాత్రాభినయం చేస్తూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

కొబ్బరి మట్టలో సంపూర్ణేష్ బాబు


సంపూర్ణేష్ బాబు హీరోగా న‌టించిన కొబ్బ‌రిమట్ట 3 నిమిషాల టీజ‌ర్ ని ఇటీవ‌లే మెగా మెన‌ల్లుడు సుప్రీమ్ హీరో సాయిధ‌ర్మ్ తేజ్ చేతుల మీదుగా విడుదల చేశారు. విడుద‌ల‌య్యిన మ‌రుక్ష‌ణం నుండే వ్యూవ్స్ లో రికార్డు క్రియోట్ చేస్తుంది. ఇప్పుడు సంపూర్ణేష్ బాబాు చిత్ర యూనిట్ తెగ సంతోషంలో ఉన్నారట..దానికి కారణం ఈ టీజర్ కి మెగాస్టార్ చిరంజీవి ఆశిస్సులు లభించడం. . ఈ చిత్రానికి క‌థ‌, మాట‌లు అందించిన స్టీవెన్ శంక‌ర్ మెగా అభిమానిగా సుప‌రిచితుడు కావ‌టం విశేషం.మెగాస్టార్ చిరంజీవి గారికి హీరో సంపూర్ణేష్ బాబు త‌న చిత్రం కొబ్బ‌రిమ‌ట్ట టీజ‌ర్ చూపించ‌టం జ‌రిగింది.

చిరంజీవికి కొబ్బరి మట్ట టీజర్ చూపిస్తున్న సంపూ


ఆ టీజ‌ర్ ని చూసిన చిరంజీవిగారు చాలా బాగుందని, కామెడిగా వుంటూ మంచి మెసెజ్ వుంద‌ని , డైలాగ్స్ రాసిన స్టీవెన్ శంక‌ర్ చాలా డెప్ట్ తో ఈ డైలాగ్స్ రాసాడ‌ని. ఇక సంపూ మాడ్యులేష‌న్ చాలా మెచ్యురిటిగా వుంద‌ని ప్ర‌శంశించారు. దీంతో సంపూ ఆనందానికి అవధులు లేకుండా పోయాయట. గతంలో ‘హృదయకాలేం’ చిత్రానికి సంబంధించి దర్శకధీరుడు జక్కన్న సంపూకి మంచి కాంప్లిమెంట్స్ ఇవ్వడంతో ఒక్కసారిగా స్టార్ మారిపోయిందని ఇప్పుడు ఏకంగా చిరంజీవి మెచ్చుకోవడంతో ఇక తన స్టార్ ఏ రేంజ్ లో మలుపు తిరగబోతుందో అని తెగ సంతోష పడుతున్నాడు బర్నింగ్ స్టార్. 

మరింత సమాచారం తెలుసుకోండి: