అనుష్క చేయబోతున్న  హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ ‘భాగ్ మతి’ కోసం  ఒక కొత్త పవర్ ఫుల్ విలన్ ని ఎంపిక చేశారు అన్న వార్తలు వస్తున్నాయి.  మలయాళం యాక్టర్ జయరామ్ ని ఆపాత్రకోసం తీసుకున్నారు.  ఇతడి కోసం  ఒక  ప్రత్యేకమైన గెటప్ ని కూడా సిద్ధం చేశారు. ఆ గెటప్ తో కూడిన ఫొటోల్ని స్వయంగా జయరాం బయట పెట్టడంతో ఈ న్యూస్ టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.

మలయాళ సినిమా రంగానికి చెందిన జయరామ్ తమిళ చిత్రాల్లోనూ నటించాడు. ఎక్కువగా కామెడీ పాత్రల్లోనే కనిపించే జయరామ్  ఇప్పుడు అనుష్క సినిమా కోసం విలన్ గా మారడం ఊహించని ట్విస్ట్.  గతంలో ‘తుపాకి’ లో విజయ్ పై అధికారిగా నటించిన జయరామ్  కామెడీ ప్రేక్షకులకు బాగా నచ్చింది. 

అయితే అందుకు భిన్నమైన పాత్రలో అనుష్క ‘భాగ్ మతి’ లో కనిపించ బోతున్నాడు  జయరామ్. ‘పిల్లజమిందార్’ ఫేమ్ అశోక్ దర్శకత్వం వహిస్తున్న ఈ ‘భాగ్ మతి’ లో ప్రభాస్ ఒక ప్రత్యేక పాత్రలో  అతిథిగా కనిపిస్తాడు అన్న ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ స్వంత నిర్మాణ సంస్థగా ప్రచారంలో ఉన్న యువీ క్రియేషన్స్ సంస్థ ఈసినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే షూటింగ్ ప్రారభంకాబోతున్న ఈ సినిమాకు అనుష్క పెద్ద ఎత్తున కాల్షీట్లు కేటాయించింది అన్న వార్తలు వస్తున్నాయి. 

మరొక ఆశ్చర్య కరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో నటించడానికి అనుష్కను ఒప్పించడానికి ఆమెకు 2.5 కోట్ల భారీ పారితోషికం ఆఫర్ చేసారు అని టాక్. ఈ వార్తలో నిజం అయితే టాలీవుడ్ సినిమారంగంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ గా అనుష్క రికార్డు క్రియేట్ చేసినట్లే  అవుతుంది. ఈ సినిమాకు సంబంధించి కనీసం ప్రారంభ పూజ కూడ జరగక పోయినా ఈ సినిమా పై పాజిటివ్ టాక్ అప్పుడే ఫిలింనగర్ లో రావడం బట్టి అనుష్క క్రేజ్ మరోసారి రుజువు అవుతోంది. ఈ సినిమాను తెలుగు తమిళ భాషలలో కలిపి నిర్మిస్తారని టాక్.. 



మరింత సమాచారం తెలుసుకోండి: