సాధారణంగా ఓ గుడ్ విల్ సంస్థపై బ్యాడ్ మార్క్ పడాలంటే ఏం చేయాలి? ఆ సంస్థపై లేని పోని అపోహలు క్రియేట్ చేయాలి. సరిగ్గా ఈ మధ్య కాలంలో పివిపి సంస్థపై వస్తున్న గాసిప్స్ ని చూస్తుంటే...వ్యవహారం ఇలాగే ఉందని అంటున్నారు. ప్రసాద్. వి. పొట్లూరి నిర్మాతగా కొనసగుతున్న సంస్థ పివిపి. ఈ సంస్థ పూర్తిగా నిర్మాణ రంగంలోకి రాకముందు పెద్ద పెద్ద మూవీలకి ఫైనాన్షియర్ గా ఉంటూ వచ్చేది.


ఎప్పుడైతే సినిమాల్లోకి పూర్తి స్థాయిలో ఎంటర్ అయిందో...కొన్ని బ్లాక్ బస్టర్ మూవీలను...కొన్ని డిజాస్టర్ మూవీలను చూడాల్సి వచ్చింది. అయితే  ఈ మధ్య కాలంలో పివిపి సంస్థ నుండి వచ్చిన సినిమాలు అన్నీ ఘోరంగా డిజాస్టర్ అవుతున్నాయనే టాక్స్ బయటకు వస్తున్నాయి. ’క్షణం’ సినిమా మినహాయించి, అన్నీ భారీ చిత్రాలు పివిపి కి కోట్ల రూపాయల్లో నష్టాన్ని చేకూర్చాయని అంటున్నారు.


ముఖ్యంగా బ్రహ్మోత్సవం ఎఫెక్ట్ తనపై ఎక్కువుగా చూపించిందని అంటున్నారు. ఇందుకు కారణంగా పివిపి సంస్థ నిర్మించిన చిత్రాలు అన్నీ మార్కెట్ లో బయ్యర్స్ కి అమ్ముకోకుండా....ఎక్కువ భాగం డైరెక్ట్ గా రిలీజ్ చేసుకున్నారంట. దీంతో నష్టాల్ని చూడాల్సి వచ్చిందని అంటున్నారు.


అయితే పివిపి సంస్థ ఎన్ని కోట్ల రూపాయలను నష్టపోయింది...ఏ మూవీకి ప్రాఫిట్స్ వచ్చాయి? ఏ మూవీకి నష్టాలు ఎంతెంత వచ్చాయి? అనే పూర్తి సమాచారాన్ని ఎవరో కావాలని బయటకు చెబుతున్నారంట. దీంతో కొంత మంది హీరోలు పివిపి సంస్థ అంటే దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. పివిపి సంస్థ పై ఇలాంటి చెడు ప్రచారాన్ని, ఓ సక్సెస్ ఫుల్ నిర్మాత చేస్తున్నాడంటూ ఇండస్ట్రీ టాక్స్ భారీగా వినిపిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: