తెలుగు ఇండస్ట్రీలో గత సంవత్సరం ‘శ్రీమంతుడు’ లాంటి బిగ్గెస్ట్ హిట్ చిత్రంలో నటించిన మహేష్ బాబు తర్వాత వచ్చే చిత్రంపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. ఇక శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘బ్రహ్మోత్సం’ చిత్రం విడుదలైన మొదటి రోజు నుంచి బ్యాడ్ టాక్ వచ్చింది. అయితే మహేష్ బాబు అంటే ఫైట్స్, యాక్షన్, కామెడీ ఉంటాయని ఊహించుకునే ఫ్యాన్స్ ఈ చిత్రంలో అలాంటివి మచ్చుకైనా లేకపోవడంతో చాలా నిరాశ చెందారు. పోకిరి, దూకుడు,బిజినెస్ మెన్ లాంటి కమర్షియల్..మాల్ మసాలా ఉన్న చిత్రాలతో పోల్చుకుంటే ఈ సినిమా అసలు మహేష్ బాబు ఏంటీ ఇలా చేశాడు అన్న పరిస్థితి నెలకొంది ఫ్యాన్స్ కి అందుకే ఇలాంటి చిత్రాన్ని అందించిన శ్రీకాంత్ అడ్డాలను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు.

అంతే కాదు ఇక బాలత్రిపురమణి సాంగ్ లో మహేష్ చేసిన డ్యాన్సులను అందరు హేళన చేస్తుండటంతో ఆ సాంగ్ కి నృత్యాలు సమకూర్చిన దినేష్ మాస్టర్ ని కూడా మహేష్ ఫ్యాన్స్ బండబూతులు తిట్టారట.  ఈ మధ్యే మహేష్ ని కించపరుస్తూ కథనం రాసారని ఇండియన్ ఎక్సప్రెస్ దినపత్రిక ఆఫీసుకి ఫోన్ చేసి మొదట బూతులు తిట్టిన మహేష్ అభిమానులు, ఆ తరువాత దినపత్రిక కార్యాలయాన్ని ముట్టడించి, ఆ కథనాన్ని రాసిన రచయితను ఉద్యోగం లోంచి సంస్థ తీసేసేంతవరకు నిద్రపోలేదు.

దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ కి నచ్చజెబుతూ..సినిమా ఆడనందుకు పూర్తి బాధ్యత తనదే, ఈ సినిమా చేయడం కూడా తన తప్పే అని లండన్ కి వెళ్ళేముందు కొంతమంది సినియర్ అభిమానులతో మహేష్ అన్నట్లు సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: