ప్రిన్స్ మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం మూవీ ప్రస్తుతం థియోటర్స్ లో ప్రదర్శనలు జరుపుకుంటుంది. అయితే బ్రహ్మోత్సవం మూవీపై పూర్తి నెగిటివ్ టాక్స్ కారణంగా, ఈ మూవీపై మార్కెట్ లో పాజిటివ్ టాక్ అనేది లేకుండా పోయింది. దీంతో ఈ ఎఫెక్ట్ ప్రేక్షకులపై పడింది. వారు థియోటర్స్ కి రాకుండా మూవీ డిజాస్టర్స్ అంటూ ముందుగానే మాట్లాడుకుంటున్నారు.


ఇదిలా ఉంటే ఈ బ్రహ్మోత్సవం ఎఫెక్ట్ ముఖ్యంగా ముగ్గురు వ్యక్తులపై బాగా ప్రభావితం చూస్తుంది. ఒకటి బ్రహ్మోత్సవం మూవీ నిర్మాత. బ్రహ్మోత్సవం మూవీ డిజాస్టర్ అనే టాక్ కారణంగా, నిర్మాత కొంత మేర నష్టాలను చూడాల్సి వచ్చింది. దీంతో నిర్మాతకి గతంలో ఉన్న అప్పులు ఏపాటివో అనేది ఇప్పుడు బయటకు వస్తున్నాయి. భవిష్యత్ లో పివిపి సంస్థపై ఇంకా గుడ్ విల్ ఉండాలంటే....తను ఇప్పుడు ఓ బ్లాక్ బస్టర్ మూవీను అందుకోవటం తప్పనిసరి అని అంటున్నారు.


ఇక రెండోవది బ్రహ్మోత్సవం మూవీ డైరెక్టర్. శ్రీకాంత్ అడ్డాలకి బ్రహ్మోత్సవం ఎఫెక్ట్ కచ్ఛితంగా ఎక్కువుగానే ఉంటుంది. భవిష్యత్ లో ఈ డైరెక్టర్ కి ఇంతటి భారీ ప్రాజెక్ట్ ఇవ్వటం అనేది ఏ హీరో సాహసం చేయరు అని అంటున్నారు. అలాగే శ్రీకాంత్ అడ్డాల కథలపై డైలాగ్ టు డైలాగ్ మానిటరింగ్ అనేది ఎక్కువుగా ఉండనుంది.


అలాగే ఈ ఎఫెక్ట్ కారణంగా కొన్ని చిత్రాలను శ్రీకాంత్ అడ్డాల వదులుకోవాల్సిన అవసరం వచ్చిందని అంటున్నారు. ఇక మూడోవది ప్రిన్స్ మహేష్ బాబు. ప్రిన్స్ ఇప్పట్లో ఇలాంటి ఫ్యామిలీ చిత్రాలను చేయకపోవటమే మంచిదని అంటున్నారు. ఒక వేళ చేసినా మరీ ఇంత మంది ఆర్టిస్ట్ లతో చేయకపోవటమే బెటర్ అని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: