మరో మూడు రోజులలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘అ ఆ’ మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని ఒక వైపు ప్రచారం చేస్తూనే ఈసినిమాలో సమంత గ్లామర్ ఎక్స్ పోజింగ్ కు సంబంధించిన ఫోటోలు వ్యూహాత్మకంగా లీక్ చేస్తూ యూత్ ను టార్గెట్ చేస్తున్నాడు త్రివిక్రమ్.

ఈ సంవత్సరం సమ్మర్ హీరోయిన్ గా రికార్డు క్రియేట్ చేసి టాలీవుడ్ కోలీవుడ్ లలో విడుదలైన భారీ సినిమాలలో నటించిన సమంత నటిస్తున్న సమ్మర్ సీజన్ లోని నాల్గవ సినిమా ఇది. అయితే ఇప్పటి దాక ఈసినిమాలో సమంత నటనకు ప్రాధాన్యత ఇస్తున్న పాత్రను చేస్తోంది అన్న కామెంట్స్ వినిపించాయి. 

అయితే లేటెస్ట్ గా విడుదల అవుతున్న ఈసినిమా పోస్టర్లను చూస్తుంటే.. సమంత అందాల డోస్ ప్రతీ ఫ్రేమ్ లోను ఉండేలా డైరెక్టర్ త్రివిక్రమ్ జాగ్రత్తలు తీసుకున్న విషయం అర్ధమవుతోంది. స్లీవ్ లెస్ డ్రస్సులు, లోనెక్ జాకెట్లు, క్లీవేజ్ కనిపించే గెటప్పులతో ‘అ ఆ’ లో సమంత అందాల ఆరబోత డోస్ ఎక్కువగానే ఉంటుంది అన్న వార్తలు వస్తున్నాయి.  ఈ సినిమాలో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న అనుపమా పరమేశ్వరన్ తో  పోటీగా సమంత వేసిన గెటప్పులు ఆ బ్యూటీని డామినేట్ చేసాయి అన్న వార్తలు వినిపిస్తున్నాయి.

త్రివిక్రమ్ తన మొట్టమొదటి సినిమా ఆనాటి యంగ్ హీరో తరుణ్ తో చేసిన తరువాత త్రివిక్రమ్ చేసిన సినిమాలు అన్నీ మహేష్ బన్నీ పవన్ ల మధ్యనే తిరిగాయి. అయితే ఎటువంటి టాప్ హీరో లేకుండా కేవలం సమంత గ్లామర్ ను నితిన్ ను తన మాటల మాయను ఆధారం చేసుకుని త్రివిక్రమ్ తీసిన ‘అ ఆ’ ఒక విధంగా త్రివిక్రమ్ కు కూడ ఒక పరీక్షగా మారబోతోంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనితో ‘అ ఆ’ విజయం నితిన్ కే కాదు త్రివిక్రమ్ కు కూడ కీలకంగా మారింది అన్న మాటలు వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: