సూపర్ స్టార్ మహేష్ తో బ్రహ్మోత్సవం తీసి బ్లాక్ బస్టర్ కొడతాడనుకున్న పివిపి డిజాస్టర్ కొట్టేశాడు. అయితే ఈ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న చిత్రయూనిట్ అంతా తీవ్ర నిరాశలో కూరుకు పోయింది. అయితే సినిమా పోయింది ఇక పివిపి సినిమాలను ఆపేస్తున్నట్టు వార్తలు జోరందుకున్నాయి. అయితే అందరికి షాక్ ఇస్తూ మరో కొత్త సినిమా న్యూస్ తో వచ్చాడు పివిపి.


బ్రహ్మోత్సవం ఫ్లాప్ అయ్యిందని తాను సినిమాలు తీయడం ఆపేస్తున్నాని.. చెన్నైలో ఆఫీస్ తీసేస్తున్నానని ఏవేవో రూమర్లు వచ్చాయి. అయితే వాటిలో ఏమాత్రం నిజం లేవంటూ క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు ఇప్పటివరకు తన ప్రొడక్షన్ లో రానటువంటి భారీ స్టార్ కాస్ట్ తో త్వరలో ఓ సినిమా ఎనౌన్స్ మెంట్ చేయబోతుననామని అన్నారు. అంటే పివిపి ఫ్లాపులకు భయపడే రకం కాదని అర్ధమవుతుంది. 


టేస్టున్న సినిమా కోసం పరితపిస్తున్న పివిపి సినిమాలను భారీగా నిర్మిస్తున్నా వాటిని సూపర్ హిట్స్ చేయడంలో మాత్రం వెనకబడి ఉన్నాడు. అయితే బ్రహ్మోత్సవం ఫ్లాప్ తో వంద కోట్ల దాకా నష్టం వచ్చిందంటూ చర్చలు జరుగుతూ ఇక సినిమా నిర్మాణానికి పివిపి గుడ్ బై చెప్పేస్తాడేమో అనుకుంటే మరో పెద్ద ప్రాజెక్ట్ తో మళ్లీ త్వరలో మీ ముందుకొస్తా అంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు.


మరి పివిపి మహేష్ కన్నా పెద్ద రేంజ్ హీరోతో సినిమా అంటే ఏ పరిశ్రమ అయినా మరింత క్రేజ్ సంపాదించిన వాడై ఉండాలి. మరి అది ఎవరన్నది ఇంకా తెలియలేదు. కొంపదీసి సూపర్ స్టార్ రజినికాంత్ తో పివిపి సినిమా ఏమన్నా ఓకే చేయించుకున్నాడా అన్న వార్తలు వినబడుతున్నాయి. సో సినిమాలు పోయినా బ్యానర్ లో భారీ తనం ఏమి తగ్గించకుండా సూపర్ అనిపించుకున్నాడు పివిపి.



మరింత సమాచారం తెలుసుకోండి: