ఈ మద్య సినిమా ఇండస్ట్రీ, టెలివిజన్ ఇండస్ట్రీకి సంబంధించిన కొంత మంది వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తలో నిలుస్తున్నారు. ఆ మద్య బుల్లితెరకు సంబంధించిన కమెడియన్ ఓ హీరోని ఇమిటేట్ చేసి పెద్ద సంచలనమే సృష్టించాడు. తాజా మరో కమెడియన్ ఇలాంటి వివాదాస్పదమైన పని చేసి చిక్కులు కొని తెచ్చుకున్నాడు.  ఎఐబీ కమీడియన్ తన్మయ్ భట్ ఈ మద్య ఓ వీడియోలో చేసిన వెకిలి చేష్టలు ఇప్పుడు యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రముఖ గాయని లతా మంగేష్కర్, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ను అపహాస్యం చేస్తున్నట్టు తన్మయ్ భట్ రూపొందించిన వీడియో పలువురు మండిపడుతున్నారు.

సచిన్ వెర్సెస్ లతా సివిల్ వార్ అనే టైటిల్ తో ఈ నెల 26న భట్ ఫేస్ బుక్ లో ఈ వీడియోను పోస్ట్ చేశాడు. ఫేస్-స్వాప్ యాప్ తో వీరి ముఖాలను అటూ ఇటూ మార్చి వితండ ప్రయోగం చేశాడు. పైగా సచిన్, లతా మంగేష్కర్ లేనిపోని సంభాషణలు చేస్తున్నట్టు దీన్ని రూపొందించాడు.ఇది కాస్త సోషల్ నెట్ వర్క్ లో హాల్ చల్ చేయడంతో  రాజ్ థాక్రే నేతృత్వంలోని నవనిర్మాణ్ సేన మండి పడింది.

తన్మయ్ భట్  అంతు చూస్తామని హెచ్చరికలు జారీ చేసింది.అటు-బాలీవుడ్ కూడా భట్ ని దుయ్యబట్టింది. అనుపమ్ ఖేర్, రితేష్ దేశ్ ముఖ్ వంటివారు.. భట్ క్షమాపణ చెప్పాలని తమ ట్విటర్స్ లో డిమాండ్ పెట్టారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: