సినిమా ఇండస్ట్రీ అంటే రంగుల ప్రపంచం అని తెలుసు..ఇక్కడ ఒకేసారి స్టార్ డమ్ వచ్చిన వారు ఉంటారు..మరికొంత మంది ఎంతో కాలం వేయిట్ చేసినా స్టార్ ఇమేజ్ రాని వారూ ఉంటారు. ఇక కొంత మంది మద్య జలసీ ఉన్నా అవి కొన్నిసందర్భాల్లో బయట పడుతుంటాయి. తాజాగా ఇద్దరు హీరోయిన్లు బహిరంగానే కొట్టుకున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అయితే ఆ ఇద్దరు హీరోయిన్లు కొట్టుకుంటేంటే హీరో గారు వారి వెంట ఉంటూ ఆపకుండా తన కెమెరాలో బంధించి మరీ ట్విట్టర్లో పెట్టాడు. ఇది చూసి ఆ హీరోయిన్లు సినిమా కోసం కొట్టుకోవడం బాలీవుడ్ లో అందరికి షాకిచ్చింది.

అయితే ఇదంతా నిజంగా జరిగిన ఫైటింగ్ కాదులేండీ.. అక్షయ్ కుమార్ తాజా సినిమా హౌజ్ ఫుల్3 సినిమా ప్రమోషన్ లో భాగంగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్, లీసా హెడెన్ లు చేసిన వెరైటే ప్రమోషన్. అయితే ఈ మద్య సినిమాల ప్రమోషన్ల కోసం హీరో హీరోయిన్లు అందులో ముఖ్య నటీనటులు వెరైటీ గా జానాల మద్యకు వచ్చి తమ సినిమా ప్రమోషన్ కోసం నానా తిప్పలు పడుతున్నారు. ఇందులో భాగంగానే  హౌజ్ ఫుల్3 కోసం ఇందులో నటించిన ముద్దుగుమ్మలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, లీసా హెడెన్ జుట్టు పట్టుకొని కొట్టుకోవడం..ఫ్లైట్ ఎక్కే సమయంలో ఒకరినొకరు పెనుగులాడుకోవడం లాంటి కొంటె పనులు చేశారు.

ఇదంతా చూస్తున్న ఆడియన్స్ అయ్యో ఆ హీరోయిన్లు అలా కొట్టుకుంటున్నారేంటా అనుకునే లోపే కిల కిలా నవ్వుకుంటూ టాటా చెప్పుకుంటూ వెళ్లారు. అక్షయ్ కుమార్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, అభిషేక్ బచ్చన్, నర్గిస్ ఫక్రి, రితేశ్ దేశ్ ముఖ్, లీసా హేడున్ లు హౌజ్ ఫుల్ 3లో నటించారు. ఈ సినిమా జూన్ 3న విడుదల కానుంది.

అక్షయ్ కుమార్ ట్విట్స్:

మరింత సమాచారం తెలుసుకోండి: