‘అ..ఆ' సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నకొద్దీ ప్రమోషన్ల జోరు అనుకున్నంత వేగంగా పెరగక పోవడం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. లేటెస్ట్ గా ఈ సినిమాలోని  ముఖ్య నటీనటులతో స్పెషల్ ఇంటర్వ్యూ షూట్ చేసి ఆ వీడియోను మీడియాకు రిలీజ్ చేసారు. ఇందులో నితిన్, సమంత, అనుపమ పరమేశ్వరన్, రావు రమేష్, పోసాని  మొదలైన వారు ‘అ ఆ’ పై తమ అభిప్రాయాలు పంచుకున్న ఆ వీడియోలో అనుకున్నంత కిక్ లేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

ఈ పరిస్థుతులు ఇలా ఉండగా హీరో నితిన్  వ్యవహార శైలి కొన్ని ప్రముఖ ఛానల్స్ కు అదేవిధంగా కొన్ని ప్రముఖ పత్రికలకు అనుకోని షాక్ ఇచ్చినట్లు సమాచారం. ‘బ్రహ్మోత్సవం’ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ల విడుదలకు ముందు పవన్ మహేష్ లు వివిధ ఛానెల్స్ కు అదేవిధంగా అనేక ప్రముఖ పత్రికలకు ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేసిన విషయం తెలిసిందే. చిన్నా పెద్ద అన్న తేడా లేకుండా అడిగిన ప్రతి మీడియాసంస్థకు పవన్ మహేష్ లు ఇంటర్వ్యూలు ఇచ్చారు. 

అయితే ‘అ ఆ’ సినిమా విషయంలో నితిన్ మీడియా వర్గాలతో పవన్ మహేష్ ల మార్గానికి భిన్నంగా వ్యహరిoచడం మీడియాకు అసహనంగా మారింది అని టాక్. ‘అ ఆ’ విడుదల అవుతున్న సందర్భంగా అనేక ప్రముఖ ఛానల్స్ అదేవిధంగా అనేక పత్రికలూ నితిన్ తో ప్రత్యేక ఇంటర్వ్యూలు చేద్దమమని ప్రయత్నించినా నితిన్ వైపు నుంచి పెద్దగా స్పందన లేకపోవడoతో నితిన్ పవన్ మహేష్ ల కంటే గొప్పవాడా అంటూ కొన్ని మీడియా వర్గాలు కామెంట్ చేస్తున్నట్లు టాక్. 

ఇది ఇలా ఉండగా ‘అ ఆ’ గురించి దర్శకుడు త్రివిక్రమ్ మీడియాతో ఇంకా తన అభిప్రాయాలను షేర్ చేసుకోకపోవడంతో ‘అ ఆ’ విషయంలో త్రివిక్రమ్ ఇలా ఎందుకు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నాడు అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఓవర్సీస్ లో ‘అ ఆ’ కు వస్తున్నంత క్రేజ్ మనతెలుగు రాష్ట్రాలలో ఈసినిమా విడుదల తేది దగ్గర అయినా ఇంకా కనిపించక పోవడం ఫిలిం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్య పరుస్తున్నట్లు టాక్. దీనికితోడు ఈసినిమా ఆన్ లైన్ బుకింగ్ లు చాలా చోట్ల ఇంకా స్పీడ్ అందుకోపోవడం మరింత ఆశ్చర్యంగా మారింది. మరి ‘అ ఆ’ విషయమై త్రివిక్రమ్ ఆలోచనలు ఏమిటో తెలియాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: