17 యేళ్ళ  యువ నట  జీవితములో (1999-ప్రస్తుతం వరకు) అన్నీకలిపి 22 సినిమాలు, 11 హిట్స్ 11 ఫట్స్.  1999 లో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన రాజకుమారుడు యువ మహెష్ సినిమా జీవితం ప్రారంభందశ తిప్పి,  దిశ చూపిన సినిమా "పోకిరి" పరిశ్రమకు 40 కోట్ల మార్కెట్  రుచి చూపించిన సినిమాతో తిరుగులేని సూపర్ స్టార్ గా ఎదిగాడు మహెష్.



"మురారి-దుకుడు-శ్రీమంతుడు”-  (3)  బ్లాక్-బస్టర్స్ (14%)

"ఒక్కడు-పోకిరి-"- (2)  ఇండస్ట్రి రికార్ద్ (9%)

“రాజకుమారుడు-యువరాజు-అతడు-బిజినెస్మాన్- సీ.వా.సి.చెట్టు”-(5) హిట్స్  (23%)

“అర్జున్-టక్కరిదొంగ-నిజం-1 నేనొక్కడినే”- (4) యావరెజ్ & బిలో యావరేజ్ (18%)

 “వంశీ-బాబి-నాని-సైనికుడు-అతిది-ఖలేజా-ఆగడు-బ్రహ్మోత్సవం” (8) ఫ్లాప్ & అట్టర్ ఫ్లాప్ (36%)


 


54 శాతం మహేష్ బాబు సినిమాలు అంటే  12  సినిమాల్లో నిర్మాతలు బాగా నష్టపోయారు ఇందులో  మరీ 8 సినిమాల్లో నిండా మునిగారు.


 


46 శాతం సినిమాల్లో మాత్రమే అంటే 10 సినిమాల్లోనే నిర్మాతలు సొమ్ముచేసుకున్నారు. 5 సినిమాలు నిర్మాతలకు బాగా ఆర్జించి పెట్టాయి. 5  సినిమాలు నిర్మాతలను ఓకే ఓకే గా ఉంచాయి.


మూడువందల ఏభై పైన సినిమాల్లో నటించి పరిశ్రమకే ప్రాణం పోసిన సూపర్-స్టార్ కృష్ణ తనయుడు, సినీ వారసుడు మహేష్ బాబు మహాబద్ధకస్తుడని,  తనతండ్రి సంపదకు వారసుడయ్యాడే కాని,  కీర్తి-ప్రతిష్ఠలకు మాత్రం వారసుడు కాదని, ఇప్పటికైతే చెప్పవచ్చు. భవిష్యత్ ను ఆయనే నిర్ణయించుకోవాలి.


 


కృష్ణ లా వైవిధ్యమున్న కథలు, పరిశ్రమనే అనేక మలుపులు తిప్పిన సినిమాలు మహేష్ నిర్మించిగాని,  నటించిగాని చూపగలడా? తనే తండ్రి విజయాలనే బెంచ్-మార్క్ చేసుకుంటే తప్ప ఆయనకు అది సాధ్యం కాదు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: