తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాన్ ‘అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి’ చిత్రంలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా విజయం సాధించకపోయినా పవన్ తనదైన మ్యానరీజంతో మెగా అభిమానులను ఆకట్టుకున్నాడు. తర్వాత తమ్ముడు, జల్సా, గబ్బర్ సింగ్ లాంటి సినిమాలతో మాస్ ఫాలోయింగ్ విపరీతంగా పెంచుకున్నారు. ఇక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజల అభిమానం మరింత చూరగొన్నారు.  పవన్ కళ్యాన్ అంటే ప్రభంజనంలా తయారైంది..ఇప్పుడు తెలుగు రాష్ట్రాలో ఎక్కడ చూసినా పవనీజం కొనసాగుతుంది. పవన్ కొన్ని మనసుకు హత్తుకునే పనులు చేస్తుంటారు..ఆయలో  ఓ అంతర్గత ఆలోచన కనపడుతుంది. పవన్ కళ్యాన్ ఆ మద్య గబ్బర్ సింగ్ కి సంబంధించి ఇచ్చిన ఇంటర్య్యూలో ఆధునిక మహాభారతం పుస్తకం గుర్తుండే ఉండి ఉంటుంది.
 Pawan helps to reprint a rare book
వెంటనే ఆ పుస్తకం పై అభిమానులు మక్కువ పెంచుకొని ఎక్కడ వెతికినా దొరకలేదు..అంతే కాదు ఆన్ లైన్ లో కూడా వెతికి చూశారు అక్కడే నిరాశే మిగిలింది. అసలు విషయానికి వస్తే..ఆ పుస్తం అచ్చు వేసినవన్నీ అప్పటికే అయిపోయాయి. తర్వాత ఆ పుస్తకం రీ ప్రింట్ వేయలేదు. మొదట్లో అంటే అప్పట్లో వేసిన ప్రింటెడ్ కాపీలే ఉన్నవాళ్లు చదువుకుంటున్నారు. పవన్ కు సైతం త్రివిక్రమ్ సెకండ్ హ్యాండ్ పుస్తకాల షాపులో దొరికితే దాన్ని గిప్ట్ గా ఇచ్చారు. పవన్ అభిరుచులు తెలిసిన వ్యక్తి త్రివిక్రమ్ కనుకనే తనకు ఆ పుస్తం ఎంతో ప్రేమతో కానుకగా ఇచ్చాడని చెప్పారు.

ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్నీ ప్రతిబింబించే పుస్తకం ఇది. కొన్ని పుస్తకాల్ని పదే పదే చదువుతుంటా అని అన్నారు. తర్వాత పవన్ ఆ పుస్తకం వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత అసలు విషయం తెలిసిందట..గుంటూరు శేషేంద్ర శర్మగారి అబ్బాయి సాత్యకిని పవన్ కలిసి, ఆ పుస్తకం రీ ప్రింట్ చేయటానికి ఫైనాన్సియల్ హెల్ప్ చేసారని తెలుస్తోంది. దాంతో ఇప్పుడు 25000 కాపీలు ప్రింట్ అవుతున్నాయి. కామన్ మ్యాన్ కు కూడా ఈ పుస్తకం అందాలని పవన్ ఆలోచించి, ఈ పుస్తకం రీ ప్రింట్ కు సహకరించారని తెలుస్తోంది.  ఏది ఏమైనా పవన్ ఉదార స్వభావం..పుస్తకాలపై ఆయనకు ఉన్న మక్కువ ఎంత గొప్పదో తెలుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: