బాహుబలి మొదటి భాగం షూటింగ్ సమయం నుంచే రాజమౌళి కొడుకు కార్తికేయ డైరెక్టర్ అయ్యే ఆలోచనలో బిజీ గా ఉన్నాడు అంటూ న్యూస్ స్ప్రెడ్ అవుతూ వచ్చింది. చాలా కాలం పాటు ఈ ప్రచారం సాగింది కూడా. తన తండ్రి సినిమాలకి సంబంధించి చాలా హెల్ప్ చేస్తూ, ప్రమోషన్ విషయం లో వైవిధ్యంగా కసరత్తు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు కార్తికేయ. పబ్లిసిటీ కాన్సెప్ట్ , ప్రమోషన్ బేస్ ల కోసం ప్రత్యేకంగా బుజినెస్ ఆఫ్ టాలీవుడ్ అంటూ సొంత సంస్థ పెట్టి మరీ చాలా సినిమాలకి పని చేసాడు.

 

సాధారణంగా డైరెక్టర్ లు అందరూ తమ కొడుకులని హీరోలు చేద్దాం అనే ఆలోచనలో ఉండగా రాజమౌళి కొడుకు మాత్రం హీరో కాదు డైరెక్టర్ అవుతాను అని ఉవ్విళ్ళు ఊరుతున్నాడు అని మనకి సమాచారం అందుతోంది. ఈ మధ్య అతను ఒక ఇంటరెస్టింగ్ షార్ట్ ఫిలిం కూడా తీయడం తో ఈ న్యూస్ కి మరింత బలం చేకూరింది. కానీ ప్రస్తుతం మనోడు మరొక కొత్త రూట్ వైపు వెళుతున్నాడు. ఆ రూట్ ఏదో ప్రొడ్యూసర్ గానో, అందరూ కోరుకున్నట్టు హీరోగానో అనుకుంటే పొరపాటే ఈ సారి ఏకంగా హోటల్ బిజినెస్ ల వైపు అతని అడుగులు కదులుతున్నాయి అంటున్నారు. మీడియా కానీ , రాజమౌళి కుటుంబ సభ్యులు కానీ , మౌళి సన్నిహితులు కానీ ఊహించని విధంగా ముఖ్యంగా ఎవరితో విషయం షేర్ చేసుకోకుండా కార్తికేయ కొండాపూర్ లోని వైట్ ఫీల్డ్ ఏరియా లో హోటల్ వ్యాపారం మొదలు పెట్టాడు. ' ది సర్క్యూట్ ' అనే పేరుతో మొదలు పెట్టిన ఈ సొంత హోటల్ ని కార్తికేయ నడుపుతున్నాడు.

 

అయితే ఇది మెయిన్ వ్యాపారమా లేక సైడ్ గా సాగిస్తారా అనేది తెలియాల్సి ఉంది . సినిమా జనాలకి బయట బిజినెస్ లు మొదలు పెట్టడం వాటి మీద సంపాదిస్తూనే సినిమాల్లో కొనసాగడం వింత విషయం ఏమీ కాదు కానీ భవిష్యత్తు లో మాత్రం డైరెక్టర్ అవ్వాలి అనుకుంటున్న ఒక యువ డైరెక్టర్ అదీ రాజమౌళి లాంటి భారీ సినిమా ల డైరెక్టర్ కొడుకు కావడం తో ఇది ఎలాంటి నిర్ణయం అనేది ఫిలిం నగర్ లో చర్చ గా మారింది. సొంత ఆలోచన తో రెండు పడవల మీద కాలు వేస్తాడా లేక మౌళి లాగా కేవలం సినిమా ప్రపంచం మీద దృష్టి పెడతాడా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా అన్నేసి కోట్ల పెట్టుబడులు అప్పుడే కుర్ర డైరెక్టర్ మీద పెట్టే ఛాన్స్ లేదు కాబట్టి నెమ్మదిగా వ్యాపారం తో పాటు సినిమాలలో కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చెయ్యచ్చు కార్తికేయ. మిగితాది భవిష్యత్తు ఫలితాన్ని బట్టి నిర్ణయించుకోవచ్చు ఏమో .


మరింత సమాచారం తెలుసుకోండి: