సిసింద్రీ అఖిల్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న అక్కినేని అభిమానులకి తీవ్రమైన నిరాశ ఎదురు అయ్యింది. మొదటి సినిమాకి మాస్ డైరెక్టర్ వినాయక్ దర్సకత్వం వహించినా కూడా ఆ సినిమా పరమ చెత్తగా రావడంతో రెండవ సినిమా విషయం లో అఖిల్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేక సతమతమవుతున్నాడు. మొదటి సినిమా వచ్చి ఏడాది పూర్తి అవడానికి ఎన్నో నెలలు లేదు కూడా, ఈ సమయం లో అఖిల్ ఒక సీరియస్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది . కానీ అఖిల్ ఏ డైరెక్టర్ తో చెయ్యాలి, స్ట్రెయిట్ కథ చెయ్యలా లేక రీమేక్ చెయ్యాలా , ద్విభాషా చిత్రమా ఓన్లీ తెలుగు వరకూ పరిమితం అవుదామా అన్నట్టు ఇరుకున పడిపోయాడు పాపం.

 

ఒక డైరెక్టర్ తో చేస్తాడు అని వార్తలు వచ్చిన కొద్ది రోజులలోనే మరొక డైరెక్టర్ తో అంటూ వార్తలు వచ్చేస్తున్నాయి. అఖిల్ మొదటి చిత్రం అతి దారుణంగా విఫలం అవడం కారణంగానే ఈ కన్ఫ్యూజన్ అంతా ఏర్పడింది. జాగ్రత్తలు తీసుకుని రెండవ సినిమా మొదలు పెట్టాలి కానీ ఇలా అతి జాగ్రత్తలకి పోవడం ఏంటి అంటున్నారు విశ్లేషకులు. డైరెక్టర్ , కథ విషయం లోనే కాకుండా ఇతర సెంటిమెంట్ లు కూడా అఖిల్ రెండవ సినిమా కోసం పాటిస్తున్నాడు. అమావాస్య రోజున 'అఖిల్' విడుదల అవడం తో అది అడ్డంగా పోయింది అని ఆ సెంటిమెంట్ కూడా తలకి ఎక్కించుకుని ఇప్పుడు కథ వినడం, డైరెక్టర్ ని మొదటి సారి కలవడం ఇలాంటి చిన్న చిన్న వాటికి కూడా మంచి రోజు చూసుకునే పరిస్థితి కి వచ్చేసాడు ఈ కుర్ర హీరో.

 

తండ్రి నాగార్జున అఖిల్ కి పూర్తి స్వేచ్చ ని ఇచ్చినా కూడా కథ సెలెక్షన్ మాత్రం తనది అనీ డైరెక్టర్ విషయం కొడుకుదే బాధ్యత అనీ అతనికే ఒదిలేస్తున్నాడట అందుకే ఎవరిని ఎంచుకోవాలి అనే విషయం లో అఖిల్ ఇంకా ఖరాఖండి గా నిర్ణయం తీసుకోలేక పోతున్నాడు. ఊపిరి తో ఫార్మ్ లోకి వచ్చిన వంశీ పైడిపల్లి చెప్పిన రెండు మూడు కథలూ నాగార్జున కి నచ్చలేదు కానీ ఏ జవానీ హై దివానీ అనే హిందీ సినిమాని రీమేక్ చేస్తాను అంటే ఆయనతో సినిమాకి సై అన్నాడు అఖిల్. అది ఏమైందో తెలీదు మళ్ళీ క్యాన్సిల్ అయ్యింది. ఈ సారి ఏకంగా త్రివిక్రమ్ తో తీస్తాడు అంటున్నారు. ఎదో ఒక న్యూస్ రావడం తప్ప కన్ఫర్మేషన్ లేక అక్కినేని ఫాన్స్ సైతం అసహనంగా ఉన్నారు. అంత సీన్ ఇవ్వకుండా కూల్ గా అఖిల్ కి నాగ్ స్వేచ్చ ఇస్తే పని అవుతుంది అనేది వారి ఉద్దేశ్యం.


మరింత సమాచారం తెలుసుకోండి: