సూపర్ స్టార్ మహేష్ బాబు ఏ విషయంలో అయినా చాల ఆచితూచి అడుగులు  వేస్తాడు. అందుకే సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా మహేష్ ఇమేజ్ గ్రాఫ్ పెరిగిపోతూనే ఉంది. ఈనేపధ్యంలో మహేష్ తన సోదరి కోరిన కోరికకి హీరో నానీతో పెట్టిన లింక్ కు సంబంధించిన న్యూస్ ఒకటి టాలీవుడ్ లో హాట్ న్యూస్ గా మారింది.

ఆశక్తి కరమైన ఈన్యూస్ వివరాలలోకి వెళ్ళితే కృష్ణ కుమార్తె మంజుల తన తమ్ముడు మహేష్ బాబుతో ‘నాని’, ‘పోకిరి’ రెండు చిత్రాలు నిర్మించిన విషయం తెలిసిందే. ఆమె నటి కూడ కొన్ని సినిమాలో నటించి తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. ఇది చాలదు అన్నట్లుగా ఆమె త్వరలో మెగాఫోన్ పట్టి త్వరలో దర్శకురాలిగ మారబోతోంది అని టాక్. ఈ సినిమాను ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది అన్న వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమాలో హీరోగా నాని నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అసలు ట్విస్ట్ ఏమిటంటే నానితో మంజుల  తీయబోతున్న సినిమా  కధను మంజుల తన  స్వీయ దర్సకత్వoలో మహేష్ తో తీయాలని ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే మహేష్ తెలివిగా తొలిగా ఒక సినిమా డైరెక్ట్ చేసి చూపెట్టు ఆతరువాత ఖచ్చితంగా తన  డేట్స్ ఇస్తాను అని  అన్నాడని ఫిలింనగర్ టాక్.  ఆతరువాత మంజుల ఈకధను హీరో నానీకి చెప్పడం అతడు ఓకే చేయడం జరిగిపోయింది అని అంటున్నారు.

దీనితో మంజులకు మహేష్ డేట్స్ రావాలి అంటే నాని సినిమా హిట్ కావాలి అంటూ సెటైర్లు పడుతున్నాయి. ప్రస్తుతం మంజుల నానితో మొదట సినిమా చేసి అద్బుతమనిపించుకుని ఆ తర్వాత మహేష్ తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.  దర్శకుడు పూరి జగన్నాధ్ తో కలిసి మంజుల సంయుక్తంగా నిర్మించిన ‘పోకిరి’ ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే ఆ తర్వాత ‘కావ్యాస్ డైరీ’ 'ఏమాయ చేసావె’ చిత్రాలు మంజుల నిర్మించింది. ప్రస్తుతం నానితో మంజుల చేయ బోతున్న సినిమా వివరాలు త్వరలో  ప్రకటింపబడే అవకాశం ఉంది అని అంటున్నారు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: