తెలుగు, తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో సూర్యపై కేసు నమోదైంది. వాస్తవానికి సూర్య కెరీర్ లో ఇప్పటి వరకు ఎలాంటి వివాదాలకు వెళ్లలేదు..అంతే కాదు తోటి నటులతో కూడా చాలా సఖ్యంగా ఉండే సూర్యపై కేసు నమోదు కావడం ఏంటా అని అనుకుంటున్నారా..! అవును  తమిళ స్టార్ హీరో సూర్య పై తమిళనాడు లోని జె 5 శాస్త్రి నగర్ పొలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది.

వివరాల్లోకి వెళితే..లెనిన్ ఇమాన్యుయెల్ (25) తన స్నేహితుడైన ప్రేమ్ కుమార్ (21)  ఇద్దరు కలిసి ఫుట్ బాల్ అడే అలవాటు ఉండేదట. ఇక ఈ ఇద్దరు కలిసి బైక్ పై వెళుతున్న సమయంలో ఆధ్యార్ ప్రాంతం లో సడెన్ గా ఓ కారు వచ్చి బైక్ ని డాష్ ఇవ్వడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. అంతే కాదు తమ బైక్ కూడా బాగా డ్యామేజ్ అయ్యిందని దీనికోసం బాధితులు తమ బైక్ బాగు చేయడానికి డబ్బులు ఇవ్వమని అడుగుతున్న సమయంలో అక్కడకు అనుకోకుండా హీరో సూర్య రావడం వారిపై చేయి చేసుకోవడం జరిగిందట.

దీంతో తమపై అనవసరంగా సూర్య చేయి చేసుకున్నాడని ఆ ఇద్దరు పోలీసులను ఆశ్రయించారు . అయితే సూర్య మేనేజర్ కథనం మరోలా ఉంది , రోడ్డు పై ట్రాఫిక్ నిలిచిపోతోంది పైగా లేడి ని పట్టుకొని వేధించడం తప్పు అని సర్దిచేప్పాడని అంటున్నాడు.  పోలిసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: