తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కుమారుడైన బన్ని వచ్చిన మొదటి సినిమా పెద్ద పేరు తీసుకు రాకపోయినా..తర్వాత వచ్చిన దేశముదురు, ఆర్య,బన్నీ చిత్రా్లో మనోడి విశ్వరూపం చూపించాడు. డ్యాన్స్, ఫైట్స్ తో మెగా ఫ్యాన్స్ కి బాగా దగ్గరయ్యాడు. గత సంవత్సరం సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంతో ఫ్యామిలీ సెంటిమెంట్ బాగా పండించాడు. ఇక ఈ సంవత్సరం బోయపాటి దర్శకత్వంలో ‘సరైనోడు’ చిత్రంతో బ్లాక్ బ్లస్టర్ విజయం సాధించాడు. అయితే ఈ మద్య బన్నీ టైమ్ అస్సులు బాగాలేదనిపిస్తుంది. ఆ మద్య బ్లాక్ బ్లస్టర్ ఫంక్షన్ లో పవన్ గురించి చెప్పను బ్రదర్ అన్నప్పటి నుంచి మనోడిపై పవన్ ఫ్యాన్ సోషల్ మీడియా ద్వారా ఎటాక్ చేశారు.

దీంతో ఒక మనసు ఆడియో ఫంక్షన్లో ఆ విషయంపై పూర్తిగా వివరించి ఫ్యాన్స్ కి క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు బన్నికి మరో పరువు పోయే సంఘటన జరిగింది.  తాజాగా సైమా ఉత్తమ నటుడి  అవార్డుల రేసులో మహేష్ బాబు , ప్రభాస్ లతో పాటు అల్లు అర్జున్ కూడా పోటీ పడుతున్నాడు అయితే అల్లు అర్జున్ మహేష్ , ప్రభాస్ ల కంటే చాలా దూరంలో వెనుకబడి ఉండటంతో ఎవరో కావాలని రాత్రికి రాత్రే 30వేల ఓట్లను వేయించారు . ఒక్క రాత్రే అనూహ్యంగా ఇన్ని వేల ఓట్లు ఎలా వస్తాయని భావించిన సైమా సిబ్బంది అలా వచ్చిన 30 వేల ఓట్లు ఫేక్ అని తేల్చి పడేసి వాటిని తొలగించింది .


ఓటింగ్ ప్రారంభం అయినప్పటి నుండి ఇదే పరిస్థితి. వీరి ఇద్దరు దాదాపు చెరో 40% శాతం ఓట్లతో నువ్వా నేనా అన్నట్లు దూసుకెలుతున్నారు. తర్వాత 11% ఓట్లతో అల్లు అర్జున్ ఉన్నారు. తర్వాత అల్లు అర్జున్ ఓట్ల శాతం భారీగా పెరిగిందని, ఊహించని విధంగా ప్రభాస్, మహేష్ బాబు ఓట్ల శాతం తగ్గిపోయింది, ఇది చూసి అంతా షాకయ్యారని, ఓటింగ్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న సైమా సైతం ఆశ్చర్య పోయిందని, క్రాస్ చెక్ చేస్తే బన్నీకి 30వేల ఫేక్ ఓట్లు పడ్డాయని తేలిందని, వెంటనే ఆ ఓట్లను సైమా తొలగించిందని ప్రచారం జరుగుతోంది.  

దాంతో అల్లు అర్జున్ ని ఎవరైనా టార్గెట్ చేసి ఇలా బ్యాడ్ చేయడానికే చేసారా ? అన్న చర్చ నడుస్తోంది . లేదంటే ఎవరైనా అల్లు అర్జున్ పై అభిమానం తో ఇలా చేసి ఉంటారా ? అన్న అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు . మొత్తానికి గతకొద్ది రోజులుగా అల్లు అర్జున్ ఏదో ఒక వివాదంలో నిలుస్తూనే ఉన్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: