స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన  ‘సరైనోడు’ సినిమాకి మొదట మిశ్రమ స్పందన వచ్చింది. కానీ తర్వాత ఈ సినిమా అనుకున్న అంచనాలు చేరుకొని  బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచిందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నారు.  మొత్తానికి  బన్ని మాత్రం  ‘సరైనోడు’ చిత్రంతో  నాలుగోసారి 50 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయాడు. సరైనోడు చిత్రం విడుదలైనపుడు ఈ చిత్రంపై మిశ్రమ స్పందన రావడం చిత్రంలో విపరీతమైన వైలెన్స్ ఉందని ప్రచారం జరిగింది.


ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చతికిలపడిపోతుందని అంతా భావించారు. కానీ మెల్లి మెల్లిగా ఈ చిత్రంపై అభిప్రాయం మరోలా మారిపోయింది..రిజల్ట్ అందుకు భిన్నంగా వస్తుండడంతో నిర్మాతతోపాటు డిస్ట్రిబ్యూటర్లు తెగ ఆనందంలో మునిగిపోతున్నారు. ప్రస్తుతానికి ఈ చిత్రానికి భారీ సినిమాలు ఏవీ పోటీకి లేకపోవడంతో ఒక్క నైజాంలోనే పదిరోజుల్లో రూ.13.97 కోట్లు కలెక్షన్స్ దుమ్ము లేపింది. 


మొదటి వారంలోనే యాబై కోట్ల మార్క్ ను అందుకొని సంచలనం సృష్టించాడు.. అంతే కాదు  బన్ని కెరీర్ లో ఇదో పెద్ద హిట్ చిత్రమే అని చెప్పవొచ్చట.  ఎప్పుడు స్టైలిష్ గా కనిపించే బన్నీ ఈ చిత్రంలో ఊర మాస్ లాగా కనిపించి యాక్షన్స్ సీన్స్ కూడా ఓ రేంజ్ లో పండించగాలనని నిరూపించుకున్నాడు. అయితే ఇప్పుడు తాజాగా సరైనోడుతో బన్నీ కలెక్ట్ చేసిన రెండు వారాల కలెక్షన్స్ కూడా చాలా బాగా ఉన్నాయి.

సరైనోడు చిత్రం ఏరియావైజ్ కలెక్షన్లు : 


నైజాం : 19 కోట్లు


సీడెడ్ : 11 కోట్లు


వైజాగ్ : 8 కోట్లు


గుంటూరు : 5.30 కోట్లు


తూర్పు గోదావరి : 5.15 కోట్లు


పశ్చిమ గోదావరి : 4.40

కృష్ణా : 4.05 కోట్లు


నెల్లూరు : 2.29 కోట్లు


టోటల్  ఏపి + తెలంగాణ : రూ.59.19 కొట్లు


కర్ణాటక : 8 కోట్లు


ఓవర్సీస్ : 5.25 కోట్లు


రెస్ట్ ఆఫ్ ఇండియా : 1.60 కోట్లు


టోటల్ వరల్డ్ వైడ్ షేర్స్ : రూ.74.04 కోట్లు 




మరింత సమాచారం తెలుసుకోండి: