మెగా స్టార్ చిరంజీవి వారసుడుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ నుంచి ఇప్పటి వరకు ఒక్క ‘మగధీర’ సినిమా తప్ప మరి ఏ బ్లాక్ బస్టర్ హిట్ రాకపోవడానికి గల కారణం రామ్ చరణ్ తీసుకుంటున్న కొన్ని అనాలోచిత నిర్ణయాలు అంటూ మెగా అభిమానులలో కొందరు బాధ పడుతున్నట్లు టాక్. దీనికితోడు గత కొంత కాలంగా చరణ్ ను వెంటాడుతున్న ఫ్లాప్ లు కూడ చరణ్ నిర్ణయాలను అయోమయంలో పడేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఫ్లాపుల్లో ఉన్న చరణ్‌ కు తన మెగా కాంపౌండ్ నుండే తీవ్ర పోటీ ఎదురౌతు ఉండటంతో అయోమయానికి లోనవుతున్న చరణ్ నెమ్మదిగా సినిమాలు చేస్తూ ఉన్న నేపధ్యంలో చరణ్ తో సినిమాలు తీద్దాము అని అనుకున్న దర్శకులు అంతా అదే మెగా కాంపౌండ్ హీరోలతో సినిమాలు చేస్తూ ఉండటం చరణ్ కు మరింత షాకింగ్ గా మారింది అని టాక్.  ఒకవైపు అల్లు అర్జున్‌ ప్రతి సినిమాతోను స్టార్‌ గా ఎదిగిపోతూ వుంటే చరణ్‌ మాత్రం అదేమీ పట్టనట్టు ఉండిపోతూ ఉండటం చరణ్ వీరాభిమానులకు ఏ మాత్రం రుచించడం లేదు అన్న వార్తలు వస్తున్నాయి. 

దీనికితోడు రామ్ చరణ్ తిరస్కరించిన కథలను తన మెగా కాంపౌండ్ హీరోలే ఎగరేసుకుపోవడం చరణ్ కు షాక్ ఇస్తోంది అని టాక్. బోయపాటి శ్రీను ముందుగా ‘సరైనోడు’ కథని చరణ్‌కే చెప్పాడు అని అంటారు. అప్పటికే మాస్‌ సినిమాలు చాలా చేసిన చరణ్ బోయపాటి కథను తిరస్కరించాడు.  కాని ఇదే కథను అల్లుఅర్జున్‌ చేసి బ్లాక్‌బస్టర్‌ కొట్టాడు. అలాగే చరణ్‌ కి కథ చెప్పిన క్రిష్‌ చరణ్ తన నిర్ణయాన్ని ఆలస్యం చేస్తూ ఉండటంతో వరుణ్ తేజ్ తో ‘కంచె’ చేసి ప్రశంసలు పొందాడు.

ఇక లేటెస్ట్ గా శేఖర్ కమ్ముల రామ్ చరణ్ కోసం తయారు చేసిన కథను కొద్దిగా మార్పులు చేసి అదే కథను వరుణ్ తేజ్ తో తీస్తున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సురేంద్రరెడ్డి దర్శకత్వంలో చరణ్ ‘ధని ఒరువన్’ రీమేక్ చేస్తున్నా ఆసినిమా నత్తనడక సాగుతూ ఉండటంతో చరణ్ కు అలసత్వం పెరిగి పోయిందా లేక అతడి కజన్స్ పై భయం పెరిగి పోయిందా అంటూ సెటైర్లు పడుతున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: