యువ హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్న నిఖిల్ సినిమా సినిమాకు తన టాలెంట్ ను మరింత పెంచుకుంటున్నాడు. కెరియర్ మొదట్లో మూస ఫార్ములాను ఫాలో అయినా తర్వాత క్రియేటివ్ సినిమాల్లో నటిస్తూ సూపర్ క్రేజ్ సంపాదించాడు. నిఖిల్ క్రేజ్ స్వామిరారా సినిమాతో మారింది. ఆ సినిమా హిట్ తో నిఖిల్ లో ఓ కొత్త ఉత్సాహం వచ్చింది. 


ఆ ఫాంలోనే కార్తికేయ సినిమా చేసి అది హిట్ సాధించాడు. అయితే లాస్ట్ ఇయర్ వచ్చిన శంకరాభరణం సినిమా ఫ్లాప్ చవి చూసిన నిఖిల్ మరోసారి సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రీసెంట్ గా ఓ రెండు రోజుల క్రితం తన సినిమా ప్రీ లుక్ రిలీజ్ చేసి ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసిన నిఖిల్ కొద్ది గంటల క్రితం ఆ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు.


నిఖిల్ సినిమా ప్రీ లుక్ :


మొన్న ప్రీ లుక్ లో గ్లాస్ దీపంతో పోస్టర్ రిలీజ్ చేసిన దర్శకుడు వి.ఐ.ఆనంద్.. ఈరోజు నిఖిల్ తో కూడిన పోస్టర్ తో పాటుగా ఆ గ్లాస్ దీపం పగిలిన సందర్భంలో నిఖిల్ పోస్టర్ రిలీజ్ చేశాడు. ఈ పోస్టర్ తో తాము తీసేది ఓ సైన్స్ ఫిక్షన్ కథ అని రివీల్ చేసిన దర్శక నిర్మాతలు సినిమాను ఎంతో పకడ్బందీ ప్లాన్ గా చేస్తున్నారనిపిస్తుంది. ఇక తమిళ్ లో ఆల్రెడీ అప్పూచి గ్రామం అనే సైన్స్ ఫిక్షన్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు వి.ఐ.ఆనంద్.. ఇప్పుడు అదే ఫార్ములాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 


నిఖిల్ కూడా ఈ ప్రాజెక్ట్ మీద ఎంతో నమ్మకంతో ఉన్నాడు. హెబ్భా పటేల్, నందిత శ్వేత హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను మేఘన నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లోనే 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' అంటూ సినిమా టైటిల్ ను కూడా రివీల్ చేశారు చిత్రయూనిట్. ఏయన్నార్ ఆత్మబలం సినిమాలోని ఈ పాట ఇప్పటికి సూపర్ హిట్టే. మరి ఆ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా కూడా నిఖిల్ కు సూపర్ హిట్ ఇవ్వాలని కోరుకుందాం. 



మరింత సమాచారం తెలుసుకోండి: