నందమూరి కళ్యాణ్ రామ్ తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. లాస్ట్ ఇయర్ పటాస్ తో తన టెంపర్ చూపించిన కళ్యాణ్ రామ్ ఈసారి ఆ టెంపర్ దర్శకుడితోనే జతకట్టాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ సినిమా ఈ మధ్యనే స్టార్ట్ అయ్యింది. సినిమాలో జర్నలిస్ట్ క్యారక్టర్ చేస్తున్న కళ్యాణ్ రామ్ లుక్ రివీల్ అయ్యింది.    


తన సినిమా హీరో లుక్ ను ట్విట్టర్ లో పెట్టి అందరికి షాక్ ఇచ్చాడు పూరి. కళ్యాణ్ రామ్ ను ఇలా చూసి అందరు షాక్ అవుతున్నారు. పూరి చేతిలో పడితే కళ్యాణ్ రామ్ మారక తప్పుతుందా.. తన లుక్ తో అందరిని ఆకట్టుకుంటున్నాడు నందమూరి హీరో. తానే నిర్మాతగా రూపొందిస్తున్న ఈ సినిమాకు ముందు రీమిక్స్ అనే టైటిల్ అనుకున్నా అది కాకుండా వేరే టైటిల్ పరిశీలనలో ఉన్నారట.


పూరి సినిమాలో కళ్యాణ్ రామ్ లుక్ :     


అంతేకాదు సినిమాలో హీరోయిన్ గా 2015 మిస్ ఇండియా వరల్డ్ విన్నర్ ఆదితి ఆర్యను దించుతున్నాడు పూరి. మరి పూరి మార్క్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉంటుంది అన్నది కళ్యాణ్ రామ్ లుక్ చూస్తేనే తెలుస్తుంది. కాజువల్ లుక్ తోనే ఇలా ఎట్రాక్ట్ చేస్తే ఇక సినిమా పోస్టర్ లో కేక పెట్టించడం ఖాయం. 


మరి పూరి హ్యాండ్ పడ్డాక నందమూరి కళ్యాణ్ రామ్ లో కూడా సరికొత్త ఉత్సాహం వచ్చిది అన్న విషయం ఈ ఫోటో చూస్తేనే తెలుస్తుంది. షేర్ సినిమాతో ఫ్లాప్ మూటకట్టుకున్న కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. మరి గెట్ప్ తో అదరగొడుతున్న కళ్యాణ్ రామ్ సినిమా ఫలితాన్ని ఎలా తెచ్చుకుంటాడో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: