మెగా హీరోల్లో నాలుగు సినిమాలతో ఓ స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న సుప్రీం హీరో సాయి ధరం తేజ్ దిల్ రాజు వ్యూహంతో తన ఖాతాలో ఓ పెద్ద హిట్ వేసుకున్నాడు. మే 6న సూర్య 24 సినిమా ఉన్నా సరే ఎంతో ధైర్యంతో సుప్రీం సినిమాను రిలీజ్ చేశాడు దిల్ రాజు. అయితే నైజాంలో మంచి పట్టున్న దిల్ రాజు సాధ్యమైనంత వరకు సూర్య 24 వచ్చే థియేటర్స్ లో కూడా సుప్రీం వేసి ఒక్క రోజైనా భారీగా కలక్షన్స్ సాధించాడు.  


ఇక సూరెయ 24 హిట్ టాక్ వచ్చినా జానర్ వేరవడంతో సుప్రీ సినిమాకు మంచి వసూళ్లే వచ్చాయి. అంతేకాదు ఎన్నో భారీ అంచనాలతో వచ్చిన బ్రహ్మోత్సవంకు కూడా సూర్య 24 సినిమా ఆడుతున్న థియేటర్స్ తప్ప చాలా తక్కువ థియేటర్స్ లోంచి సుప్రీంను తీసేశారు. ఇక బ్రహ్మోత్సవం ఫ్లాప్ అని తెలిశాక సుప్రీం కలక్షన్స్ మరింత పెరిగాయి.  


సుప్రీమ్ సినిమాలో సాయి ధరం తేజ్ :


సినిమాను ఓ మంచి కామెడీ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దటంలో దర్శకుడు అనీల్ రావిపూడి మంచి ప్రతిభ కనబరిచాడు. అంతేకాదు సినిమా సాయి ధరం తేజ్ కెరియర్లోనే హయ్యెస్ట్ కలెక్టెడ్ మూవీగా రికార్డ్ సృష్టించింది. ఇవన్ని ఒక ఎత్తైతే సినిమా 15 కోట్లకు తీసి ముందే 25 కోట్లకు అమ్మేసిన దిల్ రాజు ఈ పరిణామాలన్ని ముందే ఊహించాడు.  


సో సుప్రీం ఈరోజు ఇంత పెద్ద హిట్ అయ్యింది అంటే నైజాంలో మంచి డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు వల్లే అని చెప్పాలి. తన సత్తాతో ఆంధ్రాలో కూడా మంచి థియేటర్స్ లో సినిమా పడేలా చేసుకున్నాడు. మొత్తానికి సినిమా సక్సెస్ లో మిగతా వారి పాత్ర ఎలా ఉన్నా సుప్రీం విషయంలో దిల్ రాజు గెలిచాడని చెప్పాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: