చిన్న సినిమా ఎంత అద్భుతం గా విజయం సాధించిందో,  తెలిస్తే ఒళ్ళు పులకరించిపోతుంది. మనకు తెలిసిన బాలీఉడ్, టాలీఉడ్, కోలిఉడ్, మాలీఉడ్. మహా ఐతే భోజపురి, బెంగాలి ఇవి తప్ప మరే సినిమా రంగాలను మనం గమనించం. ఎందుకంటే హిందీ సినిమా రంగం బాలీఉడ్ మాటున పడి ఉన్న మరాఠీ సినిమా పెద్దగా ప్రచారములో లేదు. కాని ఇప్పటి వరకు అక్కడ కూడా 55 కోట్ల వసూళ్ళు సాధించిన సినిమాలు ఉన్నాయి. కాని  4 కోట్లు మాత్రమే ఈ సినిమా నిర్మాణానికి  ఖర్చు చేసి,  75 కోట్ల కలక్షన్ సాధించింది.  ఈ సినిమా 29  ఏప్రిల్ న,  విడుదలై  మన  హైదరాబాద్  పరమేశ్వరి లో రోజూ ఒక ఆటే ప్రదర్శింపబడుతుంది.


అకాష్ తోసర్-రింకు రాజ్-గురు

 


మొదట్లో ఎవరికి తెలియని సినిమా ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ తొ హౌస్-ఫుల్ గా నడుస్తుంది. సినిమా కథ కూడా సాధారణ మైనదే.  “బేస్త కులానికి చెందిన ఒక నిరుపేద పేద యువకుడు ప్రశాంత్ కాలె (అకాష్ తోసర్-డిబట్),  ధనవంతుల కుటుంబానికి చెందిన అర్చనా పాటిల్ -- (రింకు రాజ్-గురు) ఇరువురి మనసులు కలిసి ప్రేమలో పడతారు. వీరి మధ్య ఉన్న సామాజిక భేదం వలన వీరి వివాహం వారి యిళ్ళలోనూ,  సమాజంలోను అంగీకరించబడక విద్వేషాలకు దారితీయటంతో ఈ జంట ఇంట్లోంచి పారిపోయి హైదరాబాద్ వచ్చి వివాహం చేసుకుని ఒక బిడ్డకు జనమ నిచ్చి, ఇక్కడ పడ్డ అవస్తలే ఈ సినిమా”    కథ  కంటే  కథనం,  కథనం  కంటే దర్శకత్వం,  పోటీపడి  విజయాన్ని అందించాయి. ఈ సినిమాకు అద్భుత మైన  ఫోటోగ్రఫి అందించిన  సుధాకర రెడ్డి  యెక్కంటి  అచ్చ మైన  తెలుగు వాడు.


రింకు రాజ్-గురు కు 63వ నేషనల్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో స్పెషల్ మెన్షన్ గుర్తింపు కూడా లభించింది. 

నిర్మాతలు నాగరాజ్ మంజులే, నితిన్ కేని, నిఖిల్ సానే  యెస్సెల్ విజన్ & ఆట్పాట్ ప్రొడక్షన్ నాగరాజ్ మంజులే  దర్శకత్వం  అద్భుతం.  ఈ సినిమా  కథానాయిక రింకు రాజ్-గురు కు 63వ నేషనల్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో స్పెషల్ మెన్షన్ గుర్తింపు కూడా లభించింది.


అమీర్ ఖాన్ ప్రశంసలు

మన తెలుగు పరిశ్రమ కూడా చిన్న నిర్మాతలను ప్రోత్సహిస్తే మనం కూడా గొప్ప సినిమాలు నిర్మించవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: