రాబోతున్న సమ్మర్ సీజన్ పోటాపోడీ సినిమాలతో మరింతా వేడెక్కబోతోంది. విక్టరీ వెంకటేష్ - జూ.ఎన్టీఆర్ సినిమాలు ఒకే రోజు విడుదలవుతూ రసవత్తర పోటీకి రెడీ అవుతున్నాయి. వెంకటేష్ నటిస్తున్న 'షాడో' ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సరిగ్గా అదే రోజు జూ.ఎన్టీఆర్ నటిస్తున్న 'బాద్ షా' కూడా విడుదలవుతోంది. ఈ రెండు సినిమాలు మాఫియా నేపథ్యంతోనే తెరకెక్కుతుండటం మరింతా ఆసక్తిరేపుతోంది. ఈ సినిమాల్లో వెంకటేష్, ఎన్టీఆర్ మాఫియా డాన్ లు గా కనిపించబోతున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో సాప్ట్ క్యారెక్టర్ లో నటించిన విక్టరీ వెంకటేష్.. ఇప్పుడు మాఫియా డాన్ అవతారమెత్తాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న 'షాడో' మరో మల్టీస్టారర్ గా చెప్పుకోవచ్చు. వెంకటేష్ ఈ సారి శ్రీకాంత్ తో మరోసారి కలిసి నటించాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా తాప్సీ, మధురిమ నటించారు. ఎన్టీఆర్ మూవీ 'బాద్ షా' కూడా మాఫియా నేపథ్యంతోనే తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్ తో ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. శ్రీనువైట్ల తెరకెక్కిస్తున్న బాద్ షా ఫ్యామిలీ అండ్ హిల్లేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. ఇక ఇప్పటికే ఎన్టీఆర్-కాజల్ కాంబినేషన్లో బృందావనం లాంటి హిట్ సినిమా రావటంతో 'బాద్ షా'పై భారీ అంచనాలున్నాయి. ఇలా సమ్మర్ లో ఈ ఇద్దరూ స్టార్ హీరోలు ఒకే రోజు పోటి పడుతుండటం హాట్ టాపిక్ గా మారుతోంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సక్సెస్ తో మంచి ఊపు మీదున్న విక్టరీ వెంకటేష్.. దమ్ము సినిమా తర్వాత కసిగా వున్న జూనియర్ ఎన్టీఆర్.. ఈ ఇద్దరి మధ్య పోటీ రసవత్తరంగా ఉంటుందని అంటున్నారు. మరి ఈ సినిమాలతో వీరిద్దరు ఎటువంటి ఫలితాలు అందుకుంటారో ఏప్రిల్ 5న తేలబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: