కాస్త లావెక్కారు అన్న మాట ఎక్కడైనా వినిపిస్తేచాలు... భయపడి వెంటనే జిమ్ములకు పరుగులు తీసి స్లిమ్ముగా మారిపోవడానికి సిద్ధపడుతుంటారు హీరోయిన్లు. అయితే, హన్సిక పరిస్థితి విచిత్రంగా మారింది. కాస్త లావుగానే అయినా... అందరూ ‘నీ శరీరాకృతి ఇలానే బాగుందీ’ అనడం మొదలుపెట్టారట. అంతేకాదు, ఇంతకంటే లావెక్కినా బాగోవు, ఇంతకంటే ఇంకా సన్నబడ్డా బాగోవు అంటూ ఆమెకి సలహాలు ఇచ్చారట. దీంతో హన్సిక శరీరాకృతి ఎలా కాపాడుకోవాలా అని తెగ టెన్షన్ పడుతోంది. ప్రస్తుతం ఓ ట్రెయినర్ ని ఇదే విషయమై సంప్రదిస్తే... ఆయన జిమ్నాస్టిక్స్ చేయమని సలహా ఇచ్చాడట. దాంతో ప్రస్తుతం రోజూ జిమ్ కి వెళ్లి జిమ్నాస్టిక్స్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: