అంటే అవుననే చెప్పాలి..గతంలో హాస్యనటులు తాము హాస్యం ఎంత వరకు ప్రదర్శించాలో అంతే ప్రదర్శిస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే వారు. కానీ ఈ మద్య వస్తున్న చిత్రాల్లో హాస్యం కంటే ద్వంద అర్ధాలతో వచ్చీ రాని నటనతో ప్రేక్షకులను బలవంతంగా నవ్వించడానికి  ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. ఒకప్పుడు ఉపాద్యాయులంటే ఎంతో గౌరవంతో చూస్తే..ఇప్పుడు ఉపాధ్యాయులను ఆటపట్టిస్తూ..అవమానిస్తూ చాలా వ్యగ్యంగా చూపిస్తున్నారు. ఇక కామెడీకి తక్కువ బిల్డప్ కు ఎక్కవ అన్నట్లు సినిమాల్లో కావాలనే హాస్యం పెట్టినట్లు చేస్తున్నారు. బ్రహ్మానందం, ఆలీ, రాజేంద్రప్రసాద్,చంద్రమోహన్, సీనియర్ నరేష్ లాంటి హాస్యనటులు ఉన్నంత వరకు కాస్త కామెడీ బాగానే ఉందనిపించినా ఈ మద్య వారు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాక హాస్యానికి చిరునామా లేకుండా పోయింది. 


అపహస్యం లేని సినిమాలు తెలుగు లో హాస్య యుగకర్త,  హాస్యబ్రహ్మ గా చెప్పదగిన జంద్యాల తోనే దాదాపు అతరించి పోయాయి. హాస్యమే ప్రధాన కథ గా అద్భుత హాస్యరస చిత్రాలు నిర్మిం చిన ఘనత జంద్యాలదే అహ నా పెళ్ళంట, నాలుస్థంబాలాట, పడమటి సంధ్యారాగం, చూపులు కలసిన శుభవేళ, చంటబ్బాయ్, రెండుజళ్ళ సీత,  లాంటి అద్భుత సినిమాలు జంద్యాల నిర్మాణత  దర్శకత్వం లోనే వచ్చాయి. ఆయనతో ఆరొగ్యకర హాస్యం తెలుగు లో ముగిసి పోయింది.




ఇదే కాలాన్ని ఆధునిక తెలుగు సినిమా చరిత్రలో "హాస్యస్వర్ణయుగం" గా చెప్పొచ్చు. అహ నా పెళ్ళంట లో బ్రహ్మానందం, కోట, శ్రీవారికి ప్రేమలెఖలో లో సుత్తి జంటగా ప్రసిద్ధులైన వీరభద్ర రావు, వేలు, శ్రీలక్ష్మి ఏంతగా రాణించారో ప్రేక్షకులకు చెప్పనవసరం లేదు. తెలుగు సినిమా కు జంద్యాల ప్రసాదించిన వరం బ్రహ్మానందం 1000 హాస్య సినిమాల్లో నటించి గిన్నిస్ బుక్ లో ప్రవేశించాడు.  ఒక హాస్యయుగ నిర్దేశకుడైనాడు. ఇంతకాలం ఇన్ని సినిమాల్లో నటించిన బ్రహ్మా నందం అద్భుతమైన హాస్యాన్ని వరదలై పారించాడు. ఒకటి రెండు సినిమాల్లో హాస్యనాయకుడు గా నటించిన బ్రహ్మానందం ఫుల్-లెంత్ హాస్య సినిమాలో మాత్రం విజయం సాధించలేక పోయాడు.   కీర్తి చిరకాలమున్నా కొన్ని సినిమాల్లో  చెత్త హాస్యంతో అప్రతిష్ఠ కూడా మూట కట్టుకున్నాడు.




హాస్యానికి రారాజు గా వర్దిల్లిన  హాస్య కథానాయకుడుగా పేరుతెచ్చుకున్నాడు రాజెంద్రప్రసాద్. చలం తరవాత హాస్య సామ్రాజ్యాన్ని ఏలేశాడు కొంతకాలం. నూతన స్టైల్ తో  రూపు దిద్దుకొన్న హాస్యాన్ని మిస్టర్పెళ్ళాం, జోకర్,  బృందావనం, స్టేషన్ మాస్టర్, బామ్మ మాట-బంగారు బాట, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం, లెడీస్-టైలర్, పెళ్ళి పుస్తకం అత్యద్భుత హాస్య సినిమాలు జనానికి అందించి ప్రేక్షకులను ఆనందంతో ఉర్రుతలూగించాడు.  




ఆయన నటించిన “ఆఒక్కటీ అడక్కు” లాంటి, ద్వందార్ద బూతుపదాలతో శృంగార హాస్యం నిర్మాతకు డబ్బు సంపాదిన్ చినా ప్రేక్షకులు కుటుంబం తో కలిసి చూడలేని సినిమాకు ఒక ఉదాహరణ. హాస్య రసాన్ని అపహాస్యపథం లోనికి నడిపించిన ఘనత ఈ.వి.వి. సత్యనారాయణ దేనని చెప్పొచ్చు.




ఇక ఈ నాటి సినిమాల్లో హాస్యం అపహస్యమే. ప్రతి హాస్యం బిట్ హాస్యం తో ప్రారంభమై కంటిన్యూయిటి తక్కువై అపహస్యంతో ముగుస్తుంది. సెక్స్, హింస, ఎవరిపైనో వెటకారం లేదా సెటైర్లు, వావి-వరసలు లేని కామెంట్స్, విద్యనేర్పే గురుదేవులపై, ఆరోగ్యమిచ్చే వైద్యులపై ఇలా ఏవరో ఒకరిపై కుళ్ళు జోకులు, డబుల్ మీనింగులు, బూతులు ఇవే ఈనాటి హాస్య సన్నివేశాల అంతరార్ధం.  "నువ్వు - నేను" సినిమా మంచి హిట్. టీచర్స్  పై  కావల్సినంత అపహస్య పంట పండించారు. ఉపాద్యాయుడు  సహచర  ఉపాద్యాయినిల తో శృంగార వీరంగం, విచిత్ర విన్యాసాలు.  “హాపీడేస్”  లో తన టీచరు పైనే ప్రేమ తో తపించే శిష్యుడు,  అంతకు  మించిన  ఆ టీచర్ వస్త్రధారణ.  నాభి, జఘన,  వక్ష,  ముఖ  కవళికల తో  వికారమైన  సన్ని వేశాలు.  ఇక  యువత కు కొత్త గా ఊర్లో కి టీచర్ వస్తే చదువెలా చెపుతారని కాదు,  "అమెలా ఉంటుందోనని"  అలోచించటమే కాదు కల ల్లో వికార వైపరీత్యం వర్ణించ ఇంతింత కాదు అన్న పరిస్థితులు  ఏర్పడ్డాయి.  ఉషాకిరణ్ లాంటి సంస్థ కూడా హాస్యం పేరుతో యవతను హాస్యం పేరుతో అతః పాతాళా నికి తొక్కేసే "చిత్రం" సినిమా నిర్మించింది. సినిమా అంతా సంసారం చేయకుండానే సంసారం చేసిన అనుభూతితో యువత ఓల లాడారు. ప్రతిఘటన సామాజిక స్పృహకు పరాకాష్ఠ. అంతటి గొప్ప బానర్ స్పృహకోల్పోయి తీసిన సినిమా "చిత్రం".




యువత కాలేజ్ కు వెళ్ళేదే హాస్యం పేరుతో అమ్మాయిలను రాగ్ చేయటానికి, ప్రెమ, పెళ్ళి, మోసం, దగా లాంటి తప్పుడు సంకేతాలు ఇచ్చే పనులకోసమే అన్నట్లు సినిమాలు తీసే స్తున్నారు. కథానాయిక పాత్రలో హాస్యమంటే సెల్-ఫొన్, కార్, బాంక్-బాలన్స్ ఉన్న అబ్బాయి లను వాడుకొని వదిలేసే పాత్రలతో హాస్యాన్ని నింపేసే అనాచారం నిర్మాతల్లో పెరిగిపోయింది. ధనార్జన కోసమే సినిమా అనే తత్వం ప్రభలిపోయింది.




మల్లికార్జునరావు, ధర్మవరపు సుబ్రహ్మన్యం, నూతన ప్రసాద్, ఎం.ఎస్. నారాయణ, తనికెళ్ళ భరణి, గిరిబాబు, శుభలేఖ సుధాకర్, సుధాకర్, రఘుబాబు, వేణుమాధవ్, శ్రీనివాసరెడ్డి, కృష్ణభగవాన్, రవిబాబు, కోట శ్రీనివారావు, వెన్నెలకిషొర్, హేమ, శ్రీలక్ష్మి, గుండు హనమంతరావు, తాగుబోతు రమేష్, కొండవలస, ఎల్.బి. శ్రీరాం, ఏ.వి.ఎస్, ఆలి, జయప్రకాశ్ రెడ్డి, సప్తగిరి, కోవైసరళ, బాబు మోహన్, చిట్టిబాబు, అనంత్ కళ్ళు చిదంబరం, సాక్షి రంగారావు, రావు గోపాల రావు,  చంద్రమోహన్ , మొదలైనవారు హాస్యనటీనటు లుగా రాణించారు, రాణిస్తున్నారు.  ఐతే ఈ ఆధునిక హాస్యనట కథానాయకులు గా తొలుత సునీల్ ఒకటి రెండు సినిమాల్లో రాణించినా హాస్య నటుడుగానే బాగా విజయం సాధించాడు. అలాగే అల్లరి నరేష్ ఫుల్-టైం హాస్యనటుడుగా కొనసాగుతున్నాడు.    





“అపహస్యం అనేది నేటి హాస్యానికి పేరు” గా స్థిర పడింది. పోకిరి, ఇడియట్, లోఫర్, జులాయి, రోమియో, ఈ రోజుల్లో, బస్-స్టాండ్, దూకుడు, కుమారి ఎఫ్ 21, గుంటూర్ టాకీస్ సినిమాల్లో పేరుతో సహా హాస్యానికి, శృంగారానికి తేడాలేకుండా చేసేసారు.   అవధులు దాటని హాస్యం అహ్లాదం ఇస్తుంది, అదే తీరందాటితే చండాలం అవుతుంది. నాడు కుటుంబం తో కలిసి సినిమాకు వెళ్తే, ఒక అమోఘమైన భావన మిగిలేది. ఇప్పుడు భార్య తో కలసి వెళ్ళి కూడా చూడలేని "ఎంబరాసింగ్ హాస్యం" సన్నివేశాలతో తో సినిమా మనసుల్ని వికారం తో ఇంటికి పంపుటుంది. హాస్య-ట్రాక్ లేకుండా సినిమాలు విజయం సాధించటం చాలా కష్టంగా ఉన్న ఈరోజుల్లో, సూపర్-స్టార్స్ కూడా తమ సినిమాలు విజయం సాధించటానికి హాస్య నటులతో సమాంతరమైన హాస్య ప్రవాహం ఉండాలని కోరుకుంటున్నారు. ఇంతమంది హాస్యనటులున్న తెలుగు చిత్రసీమ దేశములోనే “వినోదాన్ని హాస్యం”  తో కలిపి అందించే గొప్ప  సంస్థగా చెప్ప వచ్చు. దేశములో ఏ సినిమా పరిశ్రమలోను ఇంతమంది నిపుణులైన హాస్యనటులు లేరు.




అపహస్యాన్ని తొలగించి హాస్యాన్ని మధురంగా అందిస్తే మన హాస్యం (సినిమా) పరిశ్రమ స్వర్ణయుగము లోనే ఉందనవచ్చు. ఈ మద్య కాలంలో మనల్ని హాస్యం తో అలరించిన సినిమాలు - నువ్వు లేక-నేను లేను, మన్మధుడు, నువ్వు నాకు నచ్చావు-ముఖ్యమైనవి. 



మరింత సమాచారం తెలుసుకోండి: