తెలుగు ఇండస్ట్రీలో వారసుల హవా కొనసాగుతున్న నేపథ్యంలో రెబల్ స్టార్ కృష్ణం రాజు వారసుడిగా ఈశ్వర్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ కొత్తలో పెద్ద విజయవంతమైన చిత్రాలు ఏవీ లేకున్నా..దర్శకధీరుడు రాజమౌళి తీసిన చత్రపతి చిత్రంతో విపరీతమైన క్రేజ్ సంపాదించాడు ప్రభాస్. తర్వాత వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్, మిర్చి లాంటి చిత్రాలతో స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిపోయాడు. తర్వాత రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘బాహుబలి’ చిత్రంతో తెలుగు లోనే కాకుండా హిందీ, తమిళ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు..ఒక్క ఐడియా జీవితాన్ని మారుస్తుందన్న చందంగా బాహుబలి ఒక్క చిత్రం ప్రభాస్ ఇమేజ్ ని ఎక్కడికో తీసుకు వెళ్లింది.

బాలీవుడ్ లో అయితే ప్రభాస్ కోసం కార్పొరేట్ సంస్థలు క్యూ కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఈ సినిమా ఒక్క భారత దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో విడుదల అవుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. బాహులిగా ప్రభాస్ ఎక్కడ లేని మన్ననలు అందుకుంటున్నాడు. ఈ చిత్రానికి జాతీయ అవార్డు కూడా రావడం విశేషం. తాజాగా ఈ చిత్రం ఫ్రాన్ లో రిలీజ్ అయ్యింది. ఇక బాహుబలి థియేటర్లో చూడటానికి వచ్చిన జనాలు ప్రభాస్ యాక్షన్, స్టంట్స్ చూసి దిమ్మతిరిగిపోయిందట.  సినిమా పూర్తయిన తర్వాత ఆడిటోరియం లోని 14వందల మంది ఒక్కసారిగా లేచి ప్రభాస్ కోసం చప్పట్ల వర్షం కురిపించారట .

ప్రభాస్ నటన , రాజమౌళి దర్శకత్వ ప్రతిభ , వి ఎఫ్ ఎక్స్ నిపుణుల పని తీరు , లావిష్ మేకర్స్ ల పై ప్రశంసల వర్షం కురిపించారు ఫ్రాన్స్ ప్రేక్షకులు. ఈ సినిమా ఇప్పటి వరకు 600 కోట్లు వసూళ్లు చేసి రికార్డుల మీద రికార్డులు స్థాపించగా ప్రస్తుతం బాహుబలి 2 చిత్రం షూటింగ్ షరవేగంగా జరుగుతుంది. ఇక బాహుబలి 2 ఏ రేంజ్ లో ఉండబోతుందో అని ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఇక బాహుబలి ది కంక్లూజన్ వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: