సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు దేవుళ్లపై మంచి నమ్మకం కలిగి ఉన్నవారే..తమ సినిమా రిలీజ్ సమయంలో ప్రమోషన్ తో పాటు ఆ సినిమా హిట్ కావాలని భగవంతున్ని ప్రార్థిస్తుంటారు. ఒక వేళ తమ సినిమా మంచి హిట్ అయితే చాలు అన్ని దేవుళ్లకు మొక్కి వస్తుంటారు. అయితే భారత దేశంలో మతాలకతీతంగా హిందు, ముస్లిం, క్రైస్తవులు నిత్యం ఎంతో నమ్మకంగా ప్రార్ధించే  పెద్ద దర్గా లేక అమీన్ పీర్ దర్గా తెలియనివారు ఉండరు. కడప పట్టణంలోని నకాష్ వీధి సమీపంలో ఆస్తానయె ఇలాహి ఉంది.  ఇది దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి గాంచిన దర్గా కావడం వల్ల దీనిని దక్షిణ భారతదేశపు ఆజ్మీర్ అంటారు. అమీన్‌పీర్‌ దర్గాలో పెద్ద, చిన్న కలిపి మొత్తం 18 దర్గాలు వున్నాయి. ప్రతి నెల గంథం, ఉరుసు ఇక్కడ జరుగుతోంది.వాటిలో పీరుల్లా మాలిక్‌ హుసేనీ ఉరుసు ఉత్సవం ఉర్దూ నెల ప్రకారం మొహర్రం నెలలో జరుగుతోంది. ఆరీపుల్లా హుస్సేనీ ఉరుసు ఏడు రోజుల పాటు ‘మదార్‌’ నెలలో నిర్వహిస్తారు.

దాదా ముర్షాద్‌ అమీనుల్లా హుసేనీ ఉరుసును ఖాదర్‌ నెలలో, హేదుల్లా హుసేనీ ఉరుసు రంజాన్‌ మాసంలో నిర్వహిస్తారు. అలాగే అమీనుల్లా హుస్సేనీ ఉరుసు తేరాతేజీ నెలలో భారీ ఎత్తున నిర్వహిస్తారు. ఈ దర్గాను సందర్శించడానికి వేలాది మంది భక్తులు ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ తదితర సుదూర రాష్ట్రాల నుంచీ వస్తుంటారు. మతాలకతీతంగా హిందు, ముస్లిం, క్రైస్తవులు నిత్యం పెద్ద దర్గాను సందర్శించుకొని ప్రార్థనలు నిర్వహిస్తుండడం వల్ల ఈ దర్గా మత సామరస్యానికి ప్రతీ కగా నిలిచింది. సాహెబ్‌ (స్వామి)ను నమ్ముకొని ప్రార్థించి దర్గా విబూది తీర్థం సేవిస్తే సర్వ వ్యాధులు హరిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ దర్గాకు ఎందరో ప్రసిద్ధులు,సినీ ప్రముఖులు వస్తుంటారు.

ఇందిరాగాంధీ, పి.వి. నరసింహారావు, సుశీల్ కుమార్ షిండే, నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, నందమూరి తారకరామారావు, మజ్జి తులసీ దాస్‌, గాయకుడు మహమ్మద్ రఫీ, పంకజ్ ఉధాస్, నారా చంద్రబాబునాయుడు, వై.ఎస్.రాజశేఖరరెడ్డి, రాష్ట్ర, కేంద్ర మంత్రులు, గవర్నర్లు ఇక్కడి పీఠాధిపతుల ఆశీస్సులను పొంది ఇక్కడ ప్రశాంతతకు ముగ్ధులయ్యారు. అంతర్జాతీయ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రహమాన్ సమయం చిక్కినప్పడల్లా కుటుంబ సభ్యులతో తరచూ వస్తుంటారు.

అంతే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులు చిరంజీవి, నితిన్‌, రామ్‌చరణ్‌తేజ, లారెన్స్‌, ఆర్‌పి పట్నాయక్‌, అలీ, బెల్లంకొండ సురేష్‌, చంద్రమహేష్‌, శంకర్‌, ప్రభాకర్‌, దేవిశ్రీప్రసాద్‌, నాగబాబు, గజల్ శ్రీనివాస్ , నటుడు ఆమిర్ ఖాన్‌ లాంటి వారు దర్గాను సందర్శించారు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటులు అక్షయ్ కుమార్, అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వరరాయ్‌, జయాబచ్చన్‌ చాలా మంది యంగ్ హీరోలు కూడా ఇక్కడ కు వచ్చి మొక్కుతుంటారు. 


అమీన్ పీర్ దర్గా వద్ద సూపర్ స్టార్ మహేష్ బాబు

mahesh-babu-at-dargah

అమీన్ పీర్ దర్గా వద్ద సూపర్ స్టార్ అమితాబచన్ తనయుడు అబిషేక్ బచన్

HY10ABHI2_1_GVC4KH_1048992f

అమీన్ పీర్ దర్గా వద్ద అక్షయ్ కుమార్

01CDDARGAH – Bollywood hero Akshay Kumar in Pedda Dargah on Thursday.

అమీన్ పీర్ దర్గా వద్ద తెలుగు హీరోలు రాంచరణ్, శర్వానంద్

Ramcharan at Kadapa Dargah_15

అమీన్ పీర్ దర్గా వద్ద హీరో నాని 

అమీన్ పీర్ దర్గా వద్ద తమిళ్ హీరో  సూర్య

hqdefault

అమీన్ పీర్ దర్గా వద్ద తమిళ్ హీరో  విజయ్, స్టార్ దర్శకులు మురుగదాస్

Vijay-Murugadoss-

మరింత సమాచారం తెలుసుకోండి: