అనుకోని అదృష్టంగా పవన్ లేటెస్ట్ సినిమాకు డాలి దర్శకుడుగా ఎంపిక అయినా పవన్ చెపుతున్న కొన్ని కండిషన్స్ కు కలవ పడుతున్నట్లు టాక్. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఎస్.జె. సూర్య స్థానంలో ఈసినిమాకు పవన్ డాలిని ఎంపిక చేయడం వెనుక గతంలో అతడికి పవన్ ఇచ్చిన మాటతో పాటు  సినిమాలను వేగంగా తీసే డాలి ప్రతిభ అనే కారణం కూడ ఉంది.

గతంలో ‘గోపాల గోపాల’ సినిమాను అత్యంత వేగంగా పూర్తి చేసిన డాలి ప్రతిభ పవన్ కు బాగా నచ్చడంతోమరో ఆలోచన చేయకుండా ఎస్.జె. సూర్య విషయం తేలిపోగానే పవన్ వెంటనే డాలీకి కబురు పెట్టాడు అని అంటారు. అయితే ఈసినిమాను పూర్తి చేయడానికి పవన్ కేవలం నాలుగు నెలలు మాత్రమే సమయం డాలీకి ఇచ్చి గట్టి పరీక్ష పెట్టాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎట్టి పరిస్తుతులలోను తాను ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ లో అక్టోబర్ నెలాఖరు తరువాత ఒక్క రోజు కూడ షూటింగ్ స్పాట్ కు రాను అని పవన్ డాలీని ఖంగారు పెట్టినట్లు టాక్.

దీనితో వచ్చే నెలలో ప్రారంభం అయ్యే ఈసినిమాను నాలుగు నెలలలో పూర్తి చేయాలి అంటే డాలి ఒక పెద్ద మహా యజ్ఞం చేయాలి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈసినిమా కథ గురించి డాలీకి ఇప్పటి వరకు ఏ మాత్రం అవగాహన లేని నేపధ్యంలో రచయిత ఆకుల శివ మరికొందరు రచయితలు డాలీ వద్ద కూర్చుని ఈసినిమా స్క్రిప్ట్ గురించి ఒక్క రోజు కూడ వృథా కాకుండా పరుగులు తీస్తున్నట్లు టాక్.

ఈ వార్తలు ఇలా ఉండగా పవన్ అభిమానులకు మాత్రం ఈ సినిమా ప్రాజెక్ట్ నుండి ఫెయిల్యూర్ డైరెక్టర్ ఎస్.జె. సూర్య తప్పుకున్నా అతడి స్థానంలో డాలి రావడం ఏ మాత్రం రుచించడం లేదు అని టాక్. ఇతడు దర్శకత్వం వహించిన ‘గోపాల గోపాల’ పెద్దగా సక్సస్ కాని నేపధ్యంలో సక్సస్ లేని డైరెక్టర్ ను పవన్ మళ్ళీ ఎందుకు ఎంచుకున్నాడు అని బాథ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ఇప్పటికే రకరకాల మార్పులు చేసుకున్న ఈ మూవీ ప్రాజెక్ట్ ను పవన్ పూర్తిగా  క్యాన్సిల్ చేసి వేసి ఫ్రెష్ గా త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ను త్వరగా మొదలు పెడితే బాగుంటుంది కదా మధ్యలో ఈ డాలీ ప్రయోగాలు ఎందుకు అని మధన మడుతున్నట్లు టాక్. అయితే పవన్ అభిమానుల అభిప్రాయాలు పవర్ స్టార్ అంగీకరిస్తాడా?అన్నదే  సమాధానం లేని ప్రశ్న.
  


మరింత సమాచారం తెలుసుకోండి: