త్రివిక్రమ్ పవన్ కాంబినేషన్ ల సినిమా అంటే పవన్ అభిమానులలో మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకులలో కూడ విపరీతమైన అంచనాలు ఉంటాయి. దీనికితోడు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమాను కొనడానికి క్యూ కడతారు బయ్యర్లు. ‘అ ఆ’ సూపర్ సక్సస్ తరువాత త్రివిక్రమ్ ఏ టాప్ హీరోతో సినిమా చేస్తాడు అనే వార్తలు కొద్ది రోజులు హడావిడి చేసినా చిట్ట చివరకు త్రివిక్రమ్ తన ప్రియ మిత్రుడు పవన్ ను ఎంచుకోవడంతో పవన్ అభిమానుల జోష్ కు హద్దులు లేకుండా పోయింది. 

అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక లైన్ ను మాత్రమే త్రివిక్రమ్ పవన్ కు చెప్పాడని పవన్ వెంటనే ఓకె చెప్పడంతో ఇప్పుడు ఆ సినిమాకు టోటల్ స్క్రిప్ట్ వ్రాసే పనిలో త్రివిక్రమ్ తన టీమ్ తో కలిసి ఆలోచనలు చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ అంగీకారం లభించాక కూడ ఈ సినిమా స్క్రిప్ట్ వ్యవహారం ఇంకా మొదలు కాలేదనే గాసిప్పులు వినపడుతున్నాయి. 

దీనికి కారణం ఈ కథకు సంబంధించి త్రివిక్రమ్ కు ఇంకా పూర్తి క్లారిటీ ఏర్పడ లేదు అని అంటున్నారు. అదీ కాకుండా ఈ కథను పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా నడిపించాల ? లేదంటే కొద్దిగా వర్తమాన రాజకీయ సామాజిక సమస్యలు జోడిస్తూ పవన్ భవిష్యత్ రాజకీయ అవసరాల రీత్యా దానికి అనుగుణంగా ఈ కథను మార్చాలా ? అనే సందిగ్ధం లో ప్రస్తుతం త్రివిక్రమ్ ఉన్నాడని టాక్. 

దీనికితోడు ‘అ ఆ’ సూపర్ సక్సస్ మూడ్ నుండి ఇంకా త్రివిక్రమ్ పూర్తిగా బయటకు రాకపోవడంతో త్రివిక్రమ్ పవన్ స్క్రిప్ట్ గురించి తన ఆలోచనల వేగంపెంచలేదు అనే గాసిప్పులు కూడ వినిపిస్తున్నాయి. ఒకవైపు ‘అత్తారింటికి దారేది’ కాంబినేషన్ మరోవైపు ‘అ ఆ’ సూపర్ సక్సస్ నేపధ్యం మధ్య ఒక పవర్ ఫుల్ స్టోరీ ఆలోచించడం సులువైన పని కాదు. అందుకనే త్రివిక్రమ్ నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: