మారుతీ దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తున్న ‘బాబు బంగారం’ షూటింగ్ ప్రస్తుతం చాలా వేగంగా  జరుగుతున్న విషయం తెలిసిందే. లేటెస్ట్ గా ఈసినిమా క్లైమాక్స్ షూటింగ్ హైదరాబాద్ లో చిత్ర్రీకరిస్తున్నారు. ఈ క్లైమాక్స్ కు సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలు గచ్చిబౌలీ ఫ్లై ఓవర్ పై  తీయడం వెనుక వెంకటేష్ కు ఒక సెంటిమెంట్ ఉంది అని టాక్. 

గతంలో ఈ ఫ్లై ఓవర్ పై తీసిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయిన నేపధ్యంలో తన ‘బాబు బంగారం’ షూటింగ్ కుడా గచ్చిబౌలి ఫ్లై ఓవర్ పైనే తీయమని మారుతి పై ఒత్తిడి చేసినట్లు టాక్. ఈ క్లైమాక్స్ షూటింగ్ తో ఈ సినిమా టాకీ  షూటింగ్  దాదాపు పూర్తి కావడంతో ఇక మిగిలిన ఒకే ఒక్క పాట చిత్రీకరణ కోసం 
హైదరాబాద్  రామానాయుడు స్టూడియోలో సెట్ వేస్తున్నట్లు సమాచారం. 

వెంకటేష్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమా పాటలు వచ్చే నెల 9న అభిమానుల సమక్షంలో భారీగా విడుదల కాబోతున్నాయి. అదేరోజున థియేట్రికల్ ట్రైలర్ కూడ  విడుదల చేయబోతున్నారు. ‘రన్ రాజా రన్’, ‘జిల్’, ‘ఉత్తమ విలన్’ సినిమాలకి సంగీతం అందించిన జిబ్రాన్ ఈ సినిమాకి వెంకీ స్టైల్ లో మంచి పాటలని  ట్యూన్ చేసాడట. 

‘గోపాల గోపాల’ తర్వాత వెంకటేష్ రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకుని నటిస్తున్న ఈ  సినిమా పై చాల ఆశలు పెట్టుకున్నాడు. దర్శకుడు మారుతి కూడ ఈసినిమాను హిట్ చేయగలిగితే టాప్ హీరోల దృష్టిలో పడే అవకాశం ఉంది అని ఈ సినిమా గురించి చాల ఎక్కువ కష్టపడుతున్నాడు. వెంకటేష్ నటించిన గత సినిమాలలోని కొన్ని బాడీ లాంగ్వేజ్ మేనరిజమ్స్ యధాతథంగా ఈసినిమాలో ఉపయోగించారు. ఇది ఇలా ఉండగా మెగా స్టార్ చిరంజీవి 150వ మూవీ ‘కత్తిలాంటోడు’ నైట్ షూటింగ్ ను కూడా ఈ నెల 24న గచ్చిబౌలీ ఫ్లై ఓవర్ పై జరుపుతారని వార్తలు వస్తున్న నేపధ్యం చూస్తూ ఉంటే టాప్ హీరోల సినిమాలకు గచ్చిబౌలీ ఫ్లై ఓవర్ సెంటిమెంట్ ఎలా వెంటాడుతోందో అర్ధం అవుతోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: