సినిమా హీరో - సూపర్ స్టార్ - యాక్టర్ పేరు ఏదైనా ఫాలోయింగ్ లో తక్కువ కాని వ్యక్తులు నోరు జారడం చాలా అసహ్యమైన విషయం. ముఖ్యంగా సమాజం లో జరుగుతున్న దారుణాల గురించి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడ్డం తీవ్రకరమైన బాధ. కోట్లాది మందిని తమ నడవడికతో ఆదర్శంగా మలచుకోవాల్సిన వ్యక్తులు నోరు జారడం ఎంత ప్రమాదకరం అని మొన్నటికి మొన్న బాలకృష్ణ నిరూపిస్తే ఇప్పుడు వంతు సల్మాన్ ఖాన్ ది వచ్చింది.

 

కొన్నాళ్ళ క్రితం ఒక ఆడియో వేడుక లో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు. " అమ్మాయిల వెంట పడి కడుపు చెయ్యడం ఫాన్స్ కి ఇష్టం " అంటూ మాట్లాడిన బాలయ్య భారీ ఇబ్బందుల్లో ఇరుక్కున్నారు. తాను చూడని ఎత్తులు లేవు అనీ తాను దిగని లోతులు లేవు అంటూ డబల్ మీనింగ్ లో మాట్లాడిన ఆడవారి గురించి సంచలన వ్యాఖ్యలు చేసి క్షమాపణలు చెప్పి అసెంబ్లీ లో సైతం కవరింగ్ చేసుకున్నారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ విషయం రోజూ చూస్తున్నారు గా.

 

రేప్ కి గురి అయిన స్త్రీ లాగా తన బతుకు అయిపొయింది అని వాపోయాడు మనోడు. షూటింగ్ లో ఒక ఫైటర్ ని ఎత్తి కింద పడేసే సీన్ లో బాగా ఒళ్ళు హూనం అయిపొయింది అని చెప్పదలచుకున్న సల్మాన్ ఖాన్ ఎదో తన స్టైల్ లో చిన్న పంచ్ వేద్దాం అనుకున్నట్టు ఉన్నాడు పాపం వెంటనే " అమ్మాయి రేప్ అయిపోయినట్టు అయిపొయింది నా పరిస్థితి " అంటూ ట్విట్టర్ లో నోరు జారాడు. కాగా ఈ రెండు అనుభవాల మధ్యనా సల్మాన్ పోలిక పెట్టడం బాధాకరమైన విషయం. బాలకృష్ణ , సల్మాన్ ఖాన్ లాంటి ఇలాంటి గొప్ప వ్యక్తులు, అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన వారు ఇలా మాట్లాడ్డం దారుణం అంటున్నారు విశ్లేషకులు.

 

బాలయ్య ఒక పక్క ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎందరో పేదవారికి ఉచితంగా - తక్కువ డబ్బు కే వైద్యం అందిస్తూ ఉండగా సల్మాన్ ఖాన్ తన బీయింగ్ హ్యూమన్ ద్వారా ఎంతో సేవ చేస్తున్నాడు. అందరి మన్నలూ పొందుతూ సమాజానికి ఉపయోగపడే ఇలాంటి వారు ఎదో ఒక సందర్భం లో మూర్ఖం గా ప్రవర్తించడం , నోరు జారడం లాంటివి చేస్తే జనాలు వారిని ఎంతగా ఛీదరించుకుంటారో అర్ధం చేసుకోవాలి. పసి పిల్లాడి మనస్తత్వం అంటూ కవరింగ్ చేసుకోవడం , క్షమాపణలు చెప్పడం ఇవన్నీ కాదు దీనికి విరుగుడు, ఇలాంటివి చూసి అయినా మిగితావారు కాస్త నోళ్ళు అదుపులో పెట్టుకోవడం మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: