2003 లో వచ్చిన ‘జానీ’ పవన్ నటించిన సినిమాలలో భయంకరమైన ఫ్లాప్ గా రికార్డును క్రియేట్ చేసింది. ఈ సినిమా పేరు చెపితే ఇప్పటికీ పవన్ వీరాభిమానులు ఉలిక్కి పడతారు. అయితే అటువంటి భయంకరమైన ఫ్లాప్ సినిమాలోని ఒక అంశాన్ని ఇప్పుడు దర్శకుడు సురేంద్రరెడ్డి చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ధృవ’ లో అనుసరిస్తూ ఉండటం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది.

ఆసక్తికరమైన ఈ న్యూస్ వివరాలలోకి వెళితే రామ్ చరణ్ ‘ధృవ’ సినిమాలో జపాన్ మార్షల్ ఆర్ట్స్ లో బాగా ప్రాచుర్యం పొందిన ‘ఐకిడో’ ఫైట్స్ ను చేస్తాడని వార్తలు వస్తున్నాయి. ‘ధృవ’ సినిమాలో పోలీసు ఆఫీసర్ గా రామ్ చరణ్ నటిస్తున్న నేపధ్యంలో ఈ ‘ఐకిడో’ మార్షల్ ఆర్ట్స్ చరణ్ పాత్రకు బాగా సూట్ అవుతాయనే ఉద్దేశ్యంతో ‘ధృవ’ లో ఈ మార్షల్ ఆర్ట్స్ కు సంబంధించిన ఫైట్స్ పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

చరణ్ ఈ ‘ఐకిడో’ మార్షల్ ఆర్ట్స్ లో పర్ఫెక్షన్ సాధించేందుకు జపాన్ నుంచి రప్పించిన కొందరి ట్రైనర్స్ తో ఈ మార్షల్ ఆర్స్ ను బాగా ప్రాక్టీస్ చేస్తున్నట్లు టాక్. అయితే అనుకోని ట్విస్ట్ ఏమిటంటే పవన్ ఫ్లాప్ మూవీ ‘జానీ’ లోకూడా ఈ ఐకిడో’ మార్షల్ ఆర్ట్స్ ను ప్రయోగించాడు. ఈసినిమా ఫ్లాప్ అయినా పవన్ ‘జానీ’ సినిమాలో చేసిన ఫైట్స్ మాత్రం ఆరోజులలో హాట్ టాపిక్ గా మారాయి. 

దాదాపు 13 సంవత్సరాల తరువాత చరణ్ తన బాబాయ్ ‘జానీ’ లో చేసిన ‘ఐకిడో’ మార్షల్ ఆర్ట్స్ ప్రయోగాన్ని తిరిగి ‘ధృవ’ సినిమాలో చరణ్ ఎందుకు పడుతున్నాడు అంటూ అప్పుడే కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి. ఈమధ్య కాలంలో చరణ్ సినిమాలు అన్నీ ఫ్లాప్ అవుతున్న నేపధ్యంలో పవన్ ఫ్లాప్ సినిమాలోని ట్రెండ్ ను చరణ్ తన ‘ధృవ’లో ఉపయోగించడం వెనుక కారణాలు ఏమిటి అంటూ చరణ్ అభిమానులలో చర్చలు జరుగుతున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: