దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తన సినిమాలలో నటించే హీరోయిన్స్ ను అత్యంత గ్లామర్ గా చూపెడుతూ అలా చూపెట్టడం ఒక కళ అంటాడు. ఇప్పుడు రాఘవేంద్రరావు కోడలు కనిక థిల్లాన్ తన మావగారి మాటలకు ప్రభావితమై ఆమె కూడ చాల గ్లామర్ గా ఒక ఫ్యాషన్ షోలో చేసిన హంగామా చాలామందిని ఆశ్చర్య పరిచింది. ఈమధ్య వీవ్స్ అండ్ వీవర్స్ ఫ్యాషన్ షో ఒకటి హైద్రాబాద్ లో జరిగింది. ప్రముఖ డిజైనర్ ఒకరు రూపొందించిన కలెక్షన్ ను ప్రదర్శించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 

ఈ షోలో పలువురు మోడల్స్ తో పాటు సినిమా తారలు కూడా హడావిడి చేసారు. నాగార్జున భార్య అమల ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చి అందమైన మోడల్స్ చేసిన ర్యాంప్ వాక్ ను ఎంజాయ్ చేసింది. అయితే ఈ కార్యక్రమంలో టాలీవుడ్ స్వీటి అనుష్క పాప్ సింగర్ స్మితతో పాటు పలువురు సెలిబ్రేటీలు తమ ర్యాంపు  వాక్ తో అదరగొట్టారు. ముఖ్యంగా మెగా హీరోయిన్ రెజీనా ఈ షోలో చేసిన ర్యాంప్ వాక్ అందర్నీ ఆకర్షించింది. 

ఇదంతా ప్రతి ఫ్యాషన్ షోలోను కనిపించే మామూలు హడావిడి మాత్రమే. అయితే మరో సెలబ్రిటీ అందరి దృష్టిని ఆకర్షించేసింది. ఆమె ఎవరో కాదు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కోడలు కనిక థిల్లాన్. నీలం రంగు అడ్డ చారల చీరకు ఆరెంజ్ కలర్ పెద్ద అంచు లేత ఆకుపచ్చని జాకెట్ తో కనిక ధిల్లాన్ అత్యంత గ్లామర్ గా తయారు అయి ర్యాంప్ పై తన వాక్ తో అదరగొట్టింది. ఈమె ముక్కు పుడకతో పాటు పెద్ద చెవిదిద్దులు కూడ ఈమె గ్లామర్ ను మరింత పెంచాయి.

అందమైన చీరకట్టులో ట్రెడిషనల్  స్టైల్ ను చూపెడుతూ తన బొడ్డు  కిందకు చీరకట్టుతో గ్లామర్ ను ఎక్స్ పోజ్ చేసిన రాఘవేంద్రరావు కోడలు కనిక థిల్లాన్ చూసి ‘మామకు తగ్గ కోడలు’ అంటూ ఆ ఫ్యాషన్ షోకు వచ్చిన అతిధులు కామెంట్స్ చేసుకుంటూ ఆశ్చర్య పోయినట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: