తెలుగు ఇండస్ట్రీలో అనుకోకుండా స్టార్ కలిసిన వచ్చి మంచి హీరోలుగా ఎదిగిన వారిలో ఒకరు నాని. అసిస్టెంట్ డైరెక్టర్ గా వచ్చినప్పటికీ ‘అష్టాచమ్మ’ చిత్రంతో హీరోగా తెరంగట్రం చేశాడు. తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా విజయాలు సాధించకపోయినా..నటన పరంగా మనోడు బెస్ట్ అనే చెప్పాలి. గత సంవత్సరం మారుతి దర్శకత్వంలో వచ్చన ‘భలే భలే మగాడివోయ్’ చిత్రం నాని జాతకాన్నే మర్చేసింది. తర్వాత కృష్ణగాడి వీరప్రేమగాధ ఈ మద్య రిలీజ్ అయిన ‘జెంటిల్ మాన్’ చిత్రాలు మంచి విజయాలు సాధించడంతో నానీ స్టార్ డమ్ పూర్తిగా మారిపోయింది.

మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని నటించిన  ''జెంటిల్ మన్ ''జూన్ 17న రిలీజ్ అయి ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల్లో 8 కోట్ల 60 లక్షల షేర్ ని వసూల్ చేసింది. మొదటి నుంచి సినిమా సన్సెన్స్ గా నడుస్తూ..ప్రేక్షకులను బాగా ఆకర్షించింది. ఇక నేచురల్ స్టార్ నానీ యాక్టింగ్ గురించి చెప్పనక్కరలేదు..ఇందులో నటించిన నివేదా థామస్ పెర్ఫార్మెన్స్ , సురభి గ్లామర్ వెరసి జెంటిల్ మన్ చిత్రాన్ని హిట్ బాట పట్టించాయి. ఈ చిత్రం ఇప్పటికే దాదాపు 9 కోట్ల షేర్ ని రాబట్టిన జెంటిల్ మన్ బయ్యర్ల ని లాభాల్లో ముంచెత్తడం ఖాయంగా కనిపిస్తోంది . ఏరియాల వారీగా జెంటిల్ మన్ సాధించిన షేర్ ఇలా ఉంది. 


జెంటిల్ మన్ ఏరియావైజ్ కలెక్షన్లు :


నైజాం                - 3.34 కోట్లు 

సీడెడ్                 -  1.04 కోట్లు

 ఉత్తరాంధ్ర             -   0.83 కోట్లు 

గుంటూరు             -  0.68 కోట్లు

 ఈస్ట్                    -  0.57 కోట్లు 

కృష్ణా                    -0. 62 కోట్లు

 వెస్ట్                      - 0. 47 కోట్లు 

నెల్లూర్                  - 0.21 కోట్లు 

మొత్తం -  7 .76 కోట్లు 


మొత్తం మీద వరల్డ్ వైడ్ గా 8. 60 లక్షల షేర్ ని సాధించింది మూడు రోజుల్లో.


మరింత సమాచారం తెలుసుకోండి: