తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున మొదటి నుంచి చాలా స్టైలిష్ లుక్స్ తోనే కనిపించాడు. మాస్ యాక్షన్ చేస్తూనే చాలా క్లాస్ గా కనిపించే వ్యక్తి. అంతే కాదు నాగార్జున్ ఎంట్రీ నుంచి ఎక్కువగా జీన్స్,టీ షర్ట్స్ లాంటి వేస్తూ చాలా ఫ్యాషనబుల్ గా కనిపించేవారు. ఆయన నటించిన చిత్రాల్లో కూడా కాస్ట్యూమ్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటు ఉండేవారు. తెలుగులో నవ మన్మధుడు అని ఎవరంటే ఇప్పటికీ నాగార్జున పేరు చెప్పేవారు చాలా మంది ఉన్నారు. నాగ్ ఎంత స్టయిలిష్ గా ఉంటారో..అంతే వేదాంతిలా కనిపిస్తూ ఉంటారు..అందుకే భక్తిర చిత్రాలైన అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడి సాయి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మోప్పించారు.

గత కొంత కాలాంగా నాగ్ నటించిన చిత్రాలు పెద్ద విజయాలు సాధించకున్నా ‘మనం’ చిత్రం నుంచి సూపర్ డూపర్ హిట్ అందుకుంటున్నారు. ఈ సంవత్సరం సోగ్గాడే చిన్నినాయన,ఊపిరి లాంటి బ్లాక్ బ్లస్టర్ చిత్రాల్లో నటించి తన స్టామినా ఏంటో నిరూపించుకున్నారు. తాజాగా అక్కినేని నాగార్జున సరికొత్త స్టయిల్ లో కనిపించబోతున్నారట. టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ తనయుడు హీరోగా తెరకెక్కుతోన్న నిర్మల కాన్వెంట్ సినిమాలో ఓ డిఫెరెంట్ రోల్ ప్లే చేయబోతున్నాడు నాగ్.  

ఈ  సినిమాలో విభిన్నమైన పాత్ర చేసి  నాగ్  వైవిధ్యమైన రోల్ చేబోతున్నాడు. తన దైన శైలిలో కామెడీ పండించబోతున్నాడు. ఈ సినిమాకు నాగార్జున నిర్మాతకావడం కూడా విశేషం. శ్రీకాంత్ కొడుకు తెరంగేట్రం చేయబోతుండటంతో ఈ సినిమాపై సహజంగానే సినీ అభిమానుల్లో ఆసక్తి ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: