మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న అప్ కమింగ్ ఫిల్మ్ 150వ చిత్రం. ఈమూవీకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం ప్రారంభానికి నోచుకుంది. ఇక ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ విషయంలో వినాయక్ పనితీరు మెగాస్టార్ ని కట్టిపడేసింది. సంవత్సరం నుండి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుపుకోనుంది.


తమిళంలో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన ‘కత్తి’కి రీమేక్‌గా ఈ సినిమా తెలుగు వర్షన్ లో తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం చిరంజీవి ప్రత్యేకంగా ఫిజిక్ ని మెయింటెన్ చేశాడు. ఇక లైకా ప్రొడక్షన్స్‌ తో కలిసి రామ్ చరణ్ స్వయంగా ఈ మూవీని నిర్మించటం విశేసం. ఇదిలా ఉంటే కత్తి రిమేక్ ని ఎన్ని షెడ్యూల్స్ లో పూర్తి చేయాలి, రోజుకి ఎన్ని సీన్స్ ని తీయాలి వంటి పూర్తి రిపోర్ట్ చిరుకి వినాయక్ అందించాడు.


ప్రతి రోజు సినిమా షూటింగ్ ఉన్నప్పటికీ, చిరంజీవికి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా ఆ షెడ్యూల్స్ ఉన్నాయని చిరు గమనించాడంట. ఇంత పక్కా ప్లాన్ తో షెడ్యూల్స్ ని ప్లాన్ చేయటం ఒక్క వినాయక్ తోనే సాధ్యం అని చిరంజీవి అన్నారంట. వినాయక్ పని తీరుని మెచ్చుకున్న చిరంజీవి, ఏ మాత్రం సంతోషాన్ని ఆపుకోలేక అందరి ముందు వినయాక్ ని శెభాష్ అంటూ పొగిడారు.


దీంతో వినాయక్ సైతం ఎంతో హ్యాపీగా ఉన్నారని చిత్ర యినట్ నుండి అందిన సమాచారం. ఇదిలా ఉంటే, ఈ మూవీ సంక్రాంతిని టార్గెట్ చేసుకొని షూటింగ్ ని పూర్తి చేసుకుంటుందని అంటున్నారు. మరి కొద్ది రోజుల్లో కత్తిలాంటోడు మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనున్నారని చిత్ర యూనిట్ నుండి అందుతున్న సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: