సునీల్ ఎత్తుగడకు చిరంజీవి బుట్టలో పడిపోయాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. సామాన్య ప్రేక్షకుల్లో మాత్రమే కాదు సినిమా ఇండస్ట్రీలో కూడ చింజీవికి వీరాభిమానులు ఉన్నారు. తాము నటించే సినిమాలలో ప్రేక్షకుల మెప్పు పొందడానికి ఏదోవిధంగా తాము నటించే సీన్స్ లో చిరంజీవి ప్రస్తావన తీసుకు వస్తూ ప్రేక్షకుల మెప్పు పొందడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. టాలీవుడ్ సినిమా రంగానికి సంబంధించి చిరంజీవి వీరాభిమానుల లిస్టులో సునీల్ మొదటి స్థానంలో ఉంటాడు.

అయితే చిరంజీవి 150వ సినిమాలో నటించాలని కలగన్న సునీల్ కోరికకు అనుకోని కారణాల రీత్యా  బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. చిరంజీవి ‘కత్తిలాంటోడు’ సినిమాలో సునీల్ చేయవలసిన పాత్రను మరో టాప్ కమెడియన్ తన్నుకు పోయినా సునీల్ ఏమాత్రం బాధ పడకుండా ‘మా టీవీ’ అవార్డుల వేడుకలో చిరంజీవి స్టేజ్ ఎక్కి డ్యాన్స్ చేస్తుంటే ఆయన వెనుక డ్యాన్సర్ల బృందంలో స్టెప్స్ వేసిన శ్రీకాంత్ తదితర హీరోలతో పాటు సునీల్ కూడా స్టెప్స్ వేసిన సంగతి తెలిసిందే. 

ఈ స్టెప్స్ కు ఆ ఫంక్షన్ కు వచ్చిన అతిధులకు మాత్రమే కాకుండా మెగా స్టార్ చిరంజీవికి కూడ మంచి జోష్ ను ఇచ్చాయి. దీనితో సునీల్ తాను నిజంగా మెగా స్టార్ వీరాభిమానిని అని మరోసారి నిరూపించుకున్నట్లు అయింది. ఇప్పుడు ఆ విషయమే సునీల్ కు అదృష్టంగా మారింది. ఈరోజు జరుగుతున్న సునీల్ ‘జక్కన్న’ ఆడియో ఫంక్షన్ కు ‘కత్తిలాంటోడు’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండి కూడ చిరంజీవి ఆ ఫంక్షన్ కు ముఖ్య అతిధిగా రావడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.

అంతేకాదు ‘కత్తిలాంటోడు’ డైరెక్టర్ వి.వి.వినాయక్ కూడా ఈ ఆడియో ఫంక్షన్ కు అతిథిగా రాబోతుండటం విశేషం. కొద్ది రోజుల క్రితం విడుదల అయిన ‘జక్కన్న’ టీజర్ పై నెగిటివ్ కామెంట్స్ రావడంతో సునీల్ కెరియర్ ముగిసిపోయినట్లేనా అన్న కామెంట్స్ వినిపించాయి. ఈ కామెంట్స్ విని సునీల్ కూడ తీవ్ర నిరాశలోకి వెళ్ళిపోయినట్లు టాక్. వరస పరాజయాలతో సతమతమౌతున్న సునీల్ కు ‘జక్కన్న’ కనీసం ఏవరేజ్ హిట్ ని ఇచ్చినా అది సునీల్ కెరియర్ కు టర్నింగ్ ఇచ్చినట్లే అవుతుంది. అయితే ఇప్పటికే నెగిటివ్ టాక్ తో నడుస్తున్న ‘జక్కన్న’ ఇమేజ్ కి చిరంజీవి రాక వల్ల ఏమైనా పాజిటివ్ ఇమేజ్ ఏర్పడుతుందేమో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: